కరోనా పుట్టినిల్లు చైనా ఇప్పుడు వణికిపోతోంది… రోజుకో కొత్త వేరియంట్ తరహాలో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదేపిసింది కరోనా వైరస్.. ఇప్పుడు.. డెల్టా వేరియంట్ డ్రాగన్ కంట్రీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది… చైనా వ్యాప్తంగా కొత్తగా 500 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.. అవి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదు అయ్యాయి… దీంతో, అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న 144 ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్యాక్సీ సేవలను రద్దు చేసింది.. మరోవైపు.. బీజింగ్‌లోనూ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది.. మరోసారి 600కు దిగువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒకేరోజు 638 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల […]
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూసేందుకు వినూత్న రీతిలో గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ… ఇకపై ప్రతి నెల ఆఖరి శుక్ర, శని వారాల్లో ఇంటింటికి సచివాలయ సిబ్బంది తిరుగుతారని వెల్లడించిన ఆయన… ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో కూడిన కరపత్రాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమ […]
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రేపు సాయంత్రం 5 గంటలకు ఎస్ఎస్సీ ఫలితాలు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.. కరోన మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో.. ఆయా సంవత్సరాల్లో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించినవారంతా పాస్ అయిపోయినట్టే.. అయితే, గ్రేడ్లపై కొంత కసరత్తు జరిగింది.. దీని కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్.. ఇక, హైపవర్ కమిటీ […]
వివిధ సమస్యలపై కేంద్రానికి వరుసగా లేఖరాస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా మరో లేఖ రాశారు.. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కోరారు.. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ కాస్త కిందకు దిగాయి.. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 82,297 శాంపిల్స్ పరీక్షించగా… 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 2,003 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున, కడప, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, […]
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని […]
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని […]
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్లో రష్యా రెజ్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు […]