ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా.. […]
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కృష్ణా నది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ.. గెజిట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. దీంతో… ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి… ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల […]
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలయ్యాయి… ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంద కృష్ణ… ఓ ప్రైవేట్ హోటల్లో దిగారు.. అయితే, హోటల్ గదిలోని బాత్రూమ్లో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలు అయినట్టు చెబుతున్నారు.. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన అనుచరులు… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మొత్తం ఈ నెల 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది… రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ […]
తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెను ప్రమాదమే తప్పింది… మంత్రి ఎర్రబెల్లి ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది… ట్రాక్టర్ దమ్ము చక్రాలు ఎర్రబెల్లి వాహనానికి తగిలాయి.. దీంతో.. ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది… మహబూబాబాద్ జిల్లా వెలిశాల-కొడకండ్ల మధ్య ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు… రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం దుర్మార్గం అన్నారు.. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని […]
గులాబీ తెలంగాణ.. నీలి తెలంగాణ కావాలని ఆకాంక్షించారు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్… ఇంకా సర్వీస్ ఉన్నా.. తన ఆఫీసర్‌గా ఉంటే.. ప్రజలకు నేను అనుకున్నస్థాయిలో చేరువ కాలేకపోతున్నా.. తాను అనుకున్నవిధంగా వారికి సేవ చేయలేకపోతున్నానని భావించి వీఆర్ఎస్ తీసుకున్న ఆయన.. తర్వాత బీఎస్పీలో చేరనున్నట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఇక, త్వరలోనే బీఎస్పీలో చేరనున్నారు. దీనికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. […]
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం… సరుబుజ్జిలి మండలంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కాదు, బడుగు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకం అందడం లేదో సమాధానం చెప్పాలన్నారు.. మాటలు చెప్పడం కాదు… చేతల్లో చేసి చూపాలని హితవుపలికిన ఆయన.. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లని వాళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.. గత పాలకులు స్కూళ్లలోహ సదుపాయాలున్నాయో […]
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వివిధ శాఖల్లోని పోస్టులు.. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరిల వారీగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ విభజన చేసింది.. ఏ పోస్ట్ ఏ కేటగిరి కిందకు వస్తుందో క్యాడర్ ని విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. మిగతా పోస్టులు జోనల్, మల్టీ జోనల్ పోస్టులు పేర్కొంటూ.. 84 జీవోను జారీ చేసింది ప్రభుత్వం.. కొన్ని లోకల్ క్యాడర్ పోస్టులు, జోనల్ పోస్ట్ […]