దిశ కేసు: సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం.. మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన సంచలనం సృష్టించింది.. ఇక, నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై ప్రశంసల వర్షమే కురిసిందే.. ముఖ్యంగా అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను హీరోగా కీర్తించిది సోషల్ మీడియా.. ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించింది.. అయితే, దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన త్రి సభ్య కమిషన్.. సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.. దిశ ఘటన ఎప్పుడు తెలిసింది..? కేసు ఎప్పుడు నమోదు చేశారు? విచారణ ఎలా జరిగింది..? ఎన్‌కౌంటర్ చేశారా..? మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టా..? అంటూ పలు రకాల ప్రశ్నలు వేసింది. కమిషన్.. సజ్జనార్ మధ్య జరిగిన సంభాషణను ఓసారి పరిశీలిస్తే..
కమిషన్: మిమ్మల్ని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది.. మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా?
సజ్జనార్: నేను అంగీకరించను
కమిషన్: ఎన్‌కౌటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి ?
సజ్జనార్: నాకు తెలియదు
కమిషన్: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు .. డీసీపీపైనే ఆధార పడతారా?
సజ్జనార్: గ్రౌండ్ లెవెల్‌లో ఆఫీసర్లకు పూర్తి సమాచారం ఉంటుంది.. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను
కమిషన్: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు?
సజ్జనార్: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడంలో కొంత సమయం డిలే అయ్యింది
కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
సజ్జనార్: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీసు సిబ్బంది పైన సస్పెన్షన్ విధించాం
కమిషన్: ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారు?
కమిషన్: మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాం అని సాక్షులు చెప్పారు ?
సజ్జనార్: ఎన్ కౌంటర్ స్పాట్‌కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం
కమిషన్: వీడియో సమావేశం కోసం కుర్చీలు, టెబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయంలో ఎక్కడి నుండి తెచ్చారు
సజ్జనార్: షాద్ నగర్ పోలీసులు సమగ్రినీ తీసుకొచ్చారు.. ఎక్కడి నుండి సామాగ్రిని తీసుకొచ్చారో నాకు తెలియదు.. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది నాకు గుర్తు లేదు.. లాంటి ప్రశ్నలతో కమిషన్, సజ్జనార్ మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది.. మొత్తంగా దిశ కేసులో సజ్జనార్ విచారణ ముగిసినట్టుగా సమాచారం.
Also Read
- Tags
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్‌లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!