మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో రోజుకో కొత్త ట్విస్ట్ అనే తరహాలో కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది… తాజా గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలంటున్నారు.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఊర్మిళ.. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవలే హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే కాగా.. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు […]
బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తొలిరోజే టార్గెట్ చేశారు.. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్న ఆయనకు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను […]
ట్రాఫిక్ చలానాలు ఇప్పుడు సామాన్యులను భారంగా మారుతున్నాయి… వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక ఓ యువకుడు ఏకంగా తన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు టీఎస్ 34 డీ 2183 నంబర్ గల బైక్ ఉంది.. ఆ ద్విచక్రవాహనంపై 5,500 రూపాయలు చలానాగా ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు […]
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(ప్రధాని-కిసాన్) యోజన పథకం కింద 9వ విడత నగదును బదిలీ చేసేందుకు సిద్ధమైంది… ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ… ఈ నిధులను విడుదల చేయనున్నట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. మొత్తంగా 12 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో సోమవారం రోజు రూ.19,500 కోట్ల నగదును జమ చేయనుంది కేంద్ర సర్కార్.. ఇక, […]
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్న ఆమె.. రేపు రిలీవ్ కానున్నారు.. ఏడాది పాటు ఆమె అక్కడే చదువుకోనున్నారు.. గత ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తొమ్మిది నెలలుగా మేడ్చల్ జిల్లాకు ఇన్చార్జి కలెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.. దీంతో.. హైదరాబాద్‌తో పాటు, మేడ్చల్ జిల్లాకు కూడా కొత్త […]
కరోనా దెబ్బకు వర్కింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది… చిన్న సంస్థల నుంచి బడా కంపెనీలు వరకు ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫ్రం హోం బాట పట్టాయి… పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగులను ఆఫీసుకు రప్పిస్తున్నారు.. మరికొన్ని బడా సంస్థలు సైతం.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తూనే ఉంది.. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే పని విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్.. సెప్టెంబరు నుంచి ఆఫీసుకు రావాలంటూ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోరింది. […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సీబీఐ… వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరయ్యారు.. ఇవాళ మరోమారు విచారణకు హాజరయ్యారు ఉదయ్ కుమార్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, ప్రకాష్ రెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్.. పలుమార్లు వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. మరోవైపు.. సీబీఐ అధికారులను కలిశారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్.. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వెళ్లిన ఇద్దరూ.. […]
కరోనా హమ్మారి సమయంలో విదేశీ ప్రయాణికుల రాకపై చాలా దేశాలు నిషేధం విధించాయి.. మా దేశానికి రావొద్దు అంటూ రెడ్ లిస్ట్‌లో పెట్టేశాయి… దీంతో… చాలా దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి… అంతే కాదు.. కొన్న విదేశాల వాళ్లు.. ఇతర దేశాల్లోనూ చిక్కుకుపోయిన పరిస్థితి. క్రమంగా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోతుండడంతో.. కొన్ని సడలింపులు, వెసులుబాట్లు కల్పిస్తున్నారు.. భారత్‌లో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో యూకే భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది.. అయితే, పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడడంతో రెడ్‌లాస్ట్ నుంచి తొలగించిన […]
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకంగా మారిపోయింది.. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి… స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్ల సరిఫరా కొనసాగుతోంది.. తాజాగా, అమెరికా సంస్థకు చెందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడంతో… వాటిపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. ఇక, స్వదేశీ టీకాలైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి.. ఒకటే టీకాగా వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని అనేదానిపై భారత వైద్య పరిశోధన […]
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని.. సీఎం యడియూరప్ప కాస్త మాజీ సీఎం అయిపోయారు.. ఇక, ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం లేదా కేబినెట్లో చోటు దక్కుతుందని భావించినా.. అది కూడా సాధ్యపడలేదు.. అయితే, కర్ణాటక ప్రభుత్వం తాజాగా యడియూరప్పకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం యడియూరప్ప.. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే […]