13 అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. కౌహ్సియుంగ్ లో ఇవాళ ఉదయం 13 అంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాప్తించాయి.. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 41 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు అధికారులు..
కౌహ్సియుంగ్‌లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు.. గురువారం వేకువజామున మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా భవనం మొత్తం వ్యాప్తించాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న మంటలు అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారింది.. ఈ ఘటనలో పలు అంతస్తులు ధ్వంసమయ్యాయి.. ఆ తర్వాత మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.. అగ్నిమాపక విభాగం ప్రకారం, భవనంలో 46 మంది మరణించినట్టు నిర్ధారించారు.. ఆ అపార్ట్‌మెంట్‌లో ప్రజలు నివాసం ఉంటున్న 7 నుండి 11 అంతస్తులలో చాలా మంది మరణించారని అధికారులు ప్రకటించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ 70కి పైగా ట్రక్కులను మోహరించింది.. ఇది మల్టీపరప్సస్ బిల్డింగ్.. గతంలో, ఈ భవనంలో రెస్టారెంట్లు, కచేరీ లాంజ్‌లు, సినిమా స్క్రీన్లు కూడా ఉన్నాయి.. అధికారుల ప్రకారం ఇప్పటికీ మొదటి ఐదు అంతస్తులు వాణిజ్యపరమైన ఉపయోగం కోసం ఉద్దేశించినవి.. కానీ అవి ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు.
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!