పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తనను భారత్‌కు అప్పగించవద్దని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు లండన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నీరవ్ మానసిక స్థితి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించింది కోర్టు.. నీరవ్ ఇప్పటికే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన్ను ఇక్కడి నుంచి తరలిస్తే.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని.. […]
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మళ్లీ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఒక్క రోజే లక్షకు పైగా కేసులు రావడం కలకలం రేపింది. జూన్‌లో అత్యంత తక్కువగా నమోదైన కేసులు.. ఇప్పుడు మళ్లీ పీక్‌కి చేరుకోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఒక శుక్రవారం రోజే లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. జూన్ నెల చివరిలో రోజువారీ కేసులు 11 వేలకు పడిపోయాయి. కానీ, […]
చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై కోళ్లబైలులో ఎమ్మెల్యే నవాజ్ బాషా పర్యటించారు. నేతన్న నేస్తంకు 5 వేలు లంచం అడిగినట్లు ఉద్యోగిపై స్థానికులు ఆరోపణలు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ రాజేష్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో రాజేష్‌పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో రాజేష్‌ను స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి.. లబ్ధిదారులను గుర్తించడానికి వీలుగా.. లబ్ధిదారులకు నష్టం […]
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కరోనా సమయంలో ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన ఆయనను.. ఇప్పుడు ఆయన్ను పదవి నుంచి తప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆండ్రూ క్యూమో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఉద్యోగిని రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆండ్రూ క్యూమో తనను లైంగికంగా వేధించారంటూ ఆయన దగ్గర పని చేసిన ఓ […]
తెలంగాణలో రాజకీయాలు దళిత, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లి ఘటన సాక్ష్యంగా దళిత, గిరిజన దండోర సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు […]
సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించింది. నోడల్ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించింది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిన దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్టు అంచనా వేస్తోంది. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిల్లినట్లు కమిటీ తేల్చింది. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో సుజాత […]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి […]
అత్యవసర బోర్డు సమావేశానికి సంబంధించి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు.. హైదరాబాద్ లోని జలసౌధలో జీఆర్ఎంబీకి చెందిన 10వ సమావేశం, కేఆర్ఎంబీకి చెందిన 13వ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు ప్రకటించాయి… కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోని వివిధ అంశాలను అమలు చేసేందుకు ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు వెల్లడించాయి బోర్డులు.. తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యులు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించిన గోదావరి, కృష్ణా నదీ […]
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వందల దిగువకు చేరిన తర్వాత స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 453 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 614 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859కు చేరుకోగా… […]
త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని చెప్పారు.. ఇక, ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవనాన్ని నిర్మిస్తామన్న సీఎం.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని గుర్తుచేసిన తెలంగాణ సీఎం.. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, […]