కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాసాలమర్రిలో ఇచ్చినట్టుగా.. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా దళిత బంధు ఇస్తే.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయనని స్పష్టం చేశారు. కావాలంటే బాండ్ కూడా రాసిస్తానన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్లోజరిగిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి… నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యమని.. తర్వాతే పదవులు అన్నారు. ఇక, ఎవరు […]
1981 ఏప్రిల్ 20వ తేదీన జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటన 40 ఏళ్లు పూర్తిచేసుకుంది.. అయితే, ఇప్పుడు ఇంద్రవెల్లి దండోరాతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మోసాన్ని ఎండగతాం అంటోంది.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… దీనిపై పలురకాలర విమర్శలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎన్టీవీతో మాట్లాడిన […]
టీటీడీ బోర్డు చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్ […]
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం […]
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను […]
ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. వారు బీజేపీ అయినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట, గుర్తుంచుకోవాలని.. రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు… పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో […]
నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నైకి లేఖ రాసింది కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన నివేదిక సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువును ఇవ్వాల్సిందిగా.. ఎన్జీటీని కోరారు బోర్డ్ మెంబెర్ సెక్రటరీ రాయపురే.. కాగా, గత వారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలతో ఇప్పటికే రెండు, మూడు సార్లు పర్యటన వాయిదా వేశారు. అయితే, ఎన్జీటీ పెట్టిన గడువు త్వరలోనే […]
ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా.. […]
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కృష్ణా నది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ.. గెజిట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. దీంతో… ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి… ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల […]
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలయ్యాయి… ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంద కృష్ణ… ఓ ప్రైవేట్ హోటల్లో దిగారు.. అయితే, హోటల్ గదిలోని బాత్రూమ్లో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలు అయినట్టు చెబుతున్నారు.. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన అనుచరులు… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.