హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయాలని దళిత బంధు పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు సీఎం కేసీఆర్.. అయితే, దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దు అని చెబుతున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు ఆపించే కుట్రలు జరుగుతున్నాయని.. దళిత బంధు అమలు అయితే […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో టీకా మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది.. ఆ తర్వాత పౌడర్ రూపంలో కూడా మరో మందు మార్కెట్లోకి వచ్చింది.. ఇక, త్వరలోనే ముక్కు ద్వారా వ్యాక్సిన్ పొందవచ్చు.. ఎందుకంటే… కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో ముందడుగు వేసింది… ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది.. భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు […]
దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్ […]
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి… కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఆమోదం విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది.. ఇక, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి బీజేపీ నేతల వరకు పలువురు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మొదట్లో ఆరోపణలు రాగా.. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ట్విట్టర్ సెగ తగిలింది.. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. ట్విట్టర్ ఇండియా ఎండీపై బదిలీ వేటు […]
వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి… దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ ఎప్పుడో కొట్టేస్తే… డీజిల్ ధర కూడా కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో వంద దాటేసింది.. అయితే, తమిళనాడు ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులను తగ్గించనున్నట్టు తమిళనాడు ఆర్థికమంత్రి పీ తియగ రాజన్ వెల్లడించారు.. దీంతో రాష్ట్రంలో లీటరు పెట్రోల్ పై మూడు రూపాయలు తగ్గుతుందని తెలిపారు. అయితే, ఈ […]
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ విజయంవతం అయిన తర్వాత టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై సెటైర్లు వేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్.. ఇంద్రవెల్లి సభ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందనే నమ్మకం కలిగిందన్న ఆయన… కానీ, టీఆర్ఎస్ నేతలకు మాత్రం సురుకు తగిలిందన్నారు.. అందుకే అందరూ నేతలు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు.. కొత్త చైతన్యంతో కాంగ్రెస్ నేతలు అన్ని నియోజకవర్గాలలో దండోరా వేయడానికి సిద్ధం అవుతున్నారని.. తెలంగాణ […]
ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం.. చాలా విషయాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేస్తుంటాయి.. ఇక, లైక్‌లు, కామెంట్లు, షేరింగ్‌లు.. ఇలా అది తప్పా..? ఒప్పా..? అనే విషయంతో సంబంధం లేకుండా అలా వైరల్ చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే.. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతోన్న సమయంలో.. ఎలాంటి సమస్యలు సృష్టించకుండా సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియా.. ఈ నెల 12వ తేదీన జాంబియాలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. […]
ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం […]
కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్… 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలన్నారు.. 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుంది.. […]