డిజిటల్ మీడియాకు భారీ ఊరట కలిగించింది బాంబే హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది.. ఆన్లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి పాటించాల్సిందేనని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే కాగా… ఈ నిబంధనలపై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు సీజే […]
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చివరల్లో ఉద్యోగాల జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామన్నారు.. చాలీ చాలని జీతంతో ఉన్న చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచామని.. ఉద్యోగులకు […]
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందంటూ ఓవైపు.. థర్డ్ వేవ్ ముప్పు చిన్నారులకే ఎక్కువనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు 1 నుంచి 11 మధ్యకాలంలో నగరంలో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె వెల్లడించింది. వీరిలో 210 మంది పిల్లలు 0 […]
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి… ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై ఈ నిషేధం విధిస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది కేంద్రం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, విక్రయం, వాడకంపై ఈ నిషేధం ఉంటుందని తెలిపింది. […]
భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. […]
ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్ ప్రావిన్స్… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు […]
కొత్త లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్స్జైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. తాజా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో.. మద్యం అమ్మకాలపై మరింత ఫోకస్ పెడుతోంది తెలంగాణ […]
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని […]
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 లక్షల […]
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. ఏది చెబితే అవతలి వ్యక్తి బుట్టలో పడతాడో.. మరీ గెస్‌చేసి ఊబిలోకి లాగేస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి దండుకుంటున్నారు.. తాజాగా హైదరాబాద్‌లో స్కూల్ ఫ్రెండ్‌ను అంటూ ఏకంగా రూ.14 లక్షలు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. దీనికి సోషల్ మీడియాను వాడుకున్నారు.. ఇన్స్టాగ్రామ్ లో స్కూల్ ఫ్రెండ్‌ని అంటూ హైదరాబాద్‌కు చెందిన మహిళతో పరిచయం చేసుకున్న.. కేటుగాడు.. మీకు గిఫ్ట్‌లు పంపిస్తానంటూ నమ్మబలికాడు.. ల్యాప్‌టాప్, విలువైన గిఫ్ట్స్, […]