తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి […]
హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్కు కొత్త కానప్పటికీ …హుజురాబాద్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించి.. వారిని రంగంలోకి దింపింది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ లకు అప్పగించారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఇటు కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై ఆరా […]
హాల్ మార్కింగ్ నిబంధనల అమలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని… ద ఆల్ ఇండియా జెమ్ అండ్ జువలరీ డొమెస్టిక్ కౌన్సిల్ సమ్మెకు పిలుపునిచ్చింది. రేపు సమ్మె చేపట్టనుంది. జులై 16 నుంచి దశల వారీగా దేశంలో హాల్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలిదశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్రం. అయితే ఈ విధానానికి నిరసనగా… రేపు సమ్మె చేయాలని జీజేసీ పిలుపు […]
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. దీంతో.. అక్కడ చిక్కుకున్న మనవాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది.. ఈ తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు ప్రతీ రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతిచ్చినట్టు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల […]
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఆమె.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్షకు దిగనున్నారు.. ఈ నెల 24వ తేదీన మంగళవారం లింగాపూర్‌లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుంది.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి […]
మేషం: ఈ రోజు మీరు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వృషభం: ఈరోజు మీ ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను కలుస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. మిథునం: ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.. ఆకస్మిక ధనలాభయోగం […]
కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రలు, పీహెచ్సీ సెంటర్లలో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో.. జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నెల 23వ తేదీ నుండి 10-15 రోజుల పాటు ఈ స్పెషల్ […]
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఆయన కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరురుచుకుపడ్డారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని, ఆయన ఆంబోతు వంటివారంటూ కామెంట్ చేశారు.. ఆయన అన్ని […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి.. వీటిలో కొన్ని వ్యాక్సిన్లు కోవిడ్ కొత్త వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.. తాజాగా కొన్ని దేశాలను డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ ఇలా కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి.. ఈ తరుణంలో.. డెల్టా వేరియంట్‌పై జైకోవ్-డీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని వెల్లడించారు జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్.. డెల్టా వేరియంట్‌పై జైకోవ్-డీ వ్యాక్సిన్ 66 శాతం ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందని తెలియజేశారు.. […]
తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి […]