హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.. హుజురాబాద్ ప్రజలతో పాటు.. తెలంగాణ మొత్తం ఆ ఫలితాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి..
ఇక, 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఆధిక్యాన్ని సాధించారు.. 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 3,941 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 4,326కు వచ్చాయి.. దీంతో.. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 385 ఓట్ల ఆధిక్యం దక్కింది.. అయితే, మొత్తంగా మాత్రం బీజేపీ లీడ్‌లో ఉంది.. 11 రౌండ్ల ఫలితాల తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటల 5,306 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.