మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమైన […]
మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు నిందితులు, అనుమానితులను విచారిస్తోంది సీబీఐ టీమ్.. మరికొందరిని అదుపులోకి కూడా తీసుకుంది.. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ బృందం మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత మధ్యమధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ కేసు దర్యాప్తు […]
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర… ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన […]
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపణలు కలకలం సృష్టిస్తున్నాయి… వికారాబాద్ జిల్లా తాండూరు – కర్ణాటక సరిహద్దుల్లోని సేడం చించోలి తాలూకాలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చిందని చెబుతున్నారు స్థానికులు… అర్ధరాత్రి భూప్రకంపణలు సంభవించడంతో… ఇంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు… రాత్రి అంతా ఇళ్లబయటే గడిపినట్టుగా తెలుస్తోంది.. సేడం, చించౌలి నియోజక పరిధిలోని.. దాదాపు 20 గ్రామాల్లో భూకంపం వచ్చింది… కేరెలి, బూతుపూర్, చింతకుంట, భూర్గుపల్లి, నుదిగొండ, అలచెర, వాజ్ర, కోండంపల్లి, బోక్తంపల్లి, రైగొడ సహా తదితర […]
ఈ ప్రభుత్వాన్ని బెదిరించినా, ప్రశ్నించినా మార్పు రాదు.. గద్దె దించడమే ఏకైక పరిష్కారం అంటూ.. కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు బీజేపీ నేత మురళీధర్‌రావు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాలు పంచుకుందని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకారం ఉందని.. కానీ, గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింది… ఉద్యమాల మీద లాఠీ దెబ్బలు పెరిగాయి… అధికార పార్టీ […]
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని లేఖలో సీజేఐని కోరారు వీహెచ్… లోయర్ కోర్టు తీర్పు ఇచ్చినా.. హైకోర్టులో ఏడాదిన్నరగా కేసు పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హజీపూర్ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం […]
కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వచ్చే నెల నాలుగో తేదీ (సెప్టెంబర్ 4వ) వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఏపీ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది… ఆ తర్వాత యథావిథగా అన్ని కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది.. అవి కూడా కరోనా నిబంధనలకు లోబడి చేసుకోవాల్సి […]
తాలిబన్ల అరచకాలకు భయపడి ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పోటీ పడ్డారు.. తాలిబన్లు కాబూల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. కొన్ని హృదయవిదారకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.. పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌ల్లోకి దూసుకెళ్లిన ప్రజలు.. ఎలాగైనాసరే ప్రాణాలతో బయటపడితే చాలు.. అనే తరహాలో.. విమానాలపైకి ఎక్కారు.. విమానాలు టేకాన్‌కు వెళ్తుంటే.. పరుగులు పెట్టి మరీ.. విమానాల చక్రాల దగ్గరై చోటుకోసం ప్రయత్నాలు చేశారు.. అలా విమానాలు.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులకంటే ఘోరంగా దర్శనమిచ్చాయి.. అలా విమానం […]