దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్ హెచ్చరిక జారీ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 శాంపిల్స్ పరీక్షించగా.. 1,217 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 13 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1,535 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,60,34,217కు పెరగగా… మొత్తం […]
20 నెలలు మనకు సవాల్… మన టార్గెట్ 72 సీట్లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణికమ్ ఠాగూర్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.. యూత్ కాంగ్రెస్ నుండి నాయకులుగా ఎదిగిన వాళ్లే ఎక్కువగా పార్టీలో ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏఐసీసీ కార్యదర్శులు కూడా అయ్యారన్నారు.. వచ్చే 20 నెలలు కష్టపడి పని […]
యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్న ఆయన.. యూత్ కాంగ్రెస్ వాళ్లు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తాం అన్నారు.. టికెట్ తీసుకుని జనంలోకి పోతా అంటే… ఓడిపోతారు అని హితవుపలికిన రేవంత్‌రెడ్డి.. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని.. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుడిని అంటే […]
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడి భారత రాయభార కార్యాలయంలోని మొత్తం సిబ్బందిని భారత్‌కు తరలించారు అధికారులు.. అయితే, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది… సుమారు 1000 మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.. వారిలో సుమారు 200 మంది సిక్కులు, హిందువులు స్థానిక గురుద్వారలో తలదాచుకున్నట్లు సమాచారం. ఆప్ఘన్ లో ఉన్న భారతీయులతో సహా, తాలిబాన్ల చేతిలో బందీలుగా ఉన్న సుమారు 150 మంది భారతీయులను భారత్ కు తరలించేందుకు, […]
రైల్వే ప్రయాణికులకు అప్రమత్తం కావాల్సిన సమయంలో… ఇవాళ్లి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలతో పాటు.. పలు సేవలకు తాతాల్కికంగా బ్రేక్ పడనుంది.. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్న కారణంగా.. చార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్ఎస్ ఎంక్వైరీ, టికెట్ రద్దు, చార్జీలు రీఫండ్ తదితర పీఆర్ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని తెలిపింది దక్షిణమధ్య రైల్వే అధికారులు. ఇవాళ రాత్రి 11.45 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. ఈ […]
చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.. సీఎం కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయిన మధు యాష్కీ.. […]
ఇక యుద్ధం ముగిసింది అని ప్రకటించిన తాలిబన్లు.. ఆ తర్వాత తమ ప్రకటనకు విరుద్ధంగా డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహిస్తూ అందరనీ ఆశ్చర్య పరిచారు.. మరోవైపు.. ఇప్పుడు దాదాపు 150 మందిని కిడ్నాప్ చేసి మరింత రెచ్చిపోయారు. కాబూల్ సైతం తాలిబన్ల వశం కావడంతో.. భారత్ సహా చాలా దేశాలు.. ఆఫ్ఘన్‌లోని రాయబార కార్యాలయాలను ఖాళీ చేసి.. స్వదేశాలకు తరలిపోయాయి. ఖాళీగా ఉన్న కార్యాలయాల్లోకి చొర్రబడి దౌత్యపత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని తాలిబన్లు తనిఖీలు కూడా నిర్వహించారు. […]
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఎన్నికయ్యారు.. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్‌రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.. ఇక, తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని.. […]
క్రమంగా తాలిబన్లకు కూడా మద్దతు పెరుగుతుందా? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో.. ఎందుకంటే.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై మెజార్టీ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. కొన్ని దేశాలు వారికి కూడా మద్దతుగా మాట్లాడుతున్నాయి.. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనా.. తాలిబన్లతో దోస్తీకి సిద్ధమని ప్రకటిస్తే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం వారికి మద్దతు పలికారు.. ఇక, రష్యా కూడా వారికి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడింది.. తాజాగా, బ్రిటన్ […]