గుడ్‌న్యూస్.. కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుభవార్త చెప్పింది.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ సంస్థ భారత్ బయోటెక్‌తో పాటు.. ఆ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ఎంతో కాలంగా డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, ఇవాళ అందరికీ శుభవార్త చెప్పింది డబ్ల్యూహెచ్‌వో.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌కు అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)కు ఆమోదం తెలిపింది.. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఆరు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి.. కోవిషీల్డ్, స్పుత్నిక్ వీతో పాటు భారత దేశవ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమంలో కోవాగ్జిన్‌ను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసర వినియోగ అనుమతుల కోసం అవసరమైన అన్ని పత్రాలను జూలై 9 నాటికి భారత్ బయోటెక్ సమర్పించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్ష ప్రక్రియను ప్రారంభించిందని జులైలో రాజ్యసభకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. అక్టోబర్ 18న, డబ్ల్యూహెచ్‌వో.. కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ నుండి అదనపు సమాచారాన్ని ఆశిస్తున్నట్లు తెలిపింది, దీనిని డబ్ల్యూహెచ్‌వో నిపుణులు అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది.. ఇక, ఆ తర్వాత ఆరోగ్య సంస్థకు భారత్ బయోటెక్ సమర్పించడంతో.. మళ్లీ పరిశీలన మొదలుపెట్టిన ఆ సంస్థ.. చివరకు అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చింది. కాగా, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొన్ని దేశాలు అనుమతి ఇవ్వడం లేదు.. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో పచ్చజెండా ఊపడంతో.. ఆ ఆంక్షలు తొలగిపోనున్నాయి.. కోవాగ్జిన్ టీకా వేయించుకున్నవారి కూడా విదేశీ ప్రయాణం చేయడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది. అంతేకాదు.. కొన్ని దేశాలు కోవాగ్జిన్ టీకాలు దిగుమతి చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేశాయి.. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో నిర్ణయంతో.. కోవాగ్జిన్ ఎగుమతులు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
తాజావార్తలు
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!