కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా […]
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది… మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. మల్లారెడ్డికి కాదు.. సీఎం కేసీఆర్‌కే నా సవాల్.. అసెంబ్లీ రద్దు చేసి రావాలి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించాడు రేవంత్‌రెడ్డి.. ఇక, అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు.. అయితే, తాజాగా రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇస్తూనే.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.. తాను ఎంపీ […]
కరోనా సెకండ్ వేవ్ కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా బయపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కేంద్రం కోవిడ్ మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది.. మరో నెల రోజుల పాటు కోవిడ్ మార్గదర్శాలు అమల్లో ఉంటాయంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, రానున్న పండుగ సీజన్లో పెద్ద సమూహాలతో సమావేశాలు జరుగకుండా చూసుకోవాలని […]
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి… శుక్రవారం రోజు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టారు.. రేవంత్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
కరోనా మహమ్మారి కట్టడికోసం ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రపంచదేశాలతో పాటు.. భారత్‌లో కూడా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇప్పటికే దేశ్యాప్తంగా 62.29 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది భారత్.. ఇక, శుక్రవారం ఒకేరోజు కోటి డోసులు వేసి.. మరో అరుదైన ఘనత సాధించారు.. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది.. భారత్‌లో ఒకేరోజు కోటి మందికి వ్యాక్సినేషన్‌పై సంతోషాన్ని వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్.. సోషల్ మీడియా వేదికగా […]
మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసి.. సెప్టెంబర్లోకి అడుగుపెట్టబోతున్నాయం.. లావాదేవీల కోసం నిత్యం బ్యాంకులకు చుట్టూ తిరిగేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందకంటే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు మొత్తంగా 12 రోజుల సెలవులు […]
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది.. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆయన బామ్మర్ది మద్దుల శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.. ఆయనపై కూడా కబ్జా ఆరోపణలు చేశారు.. ఇక, రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. నన్ను ఉప సర్పంచ్ అని అన్నావ్… కానీ, నేను సర్పంచ్ గా పనిచేసాను అని తెలుసుకోవాలని సూచించారు.. మల్లారెడ్డికి […]
ఎక్కడ రాజీపడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం.. చక్కగా కాపాడుకోవాలి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు […]
ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు… ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది… రేవంత్‌రెడ్డితో పాటు.. అప్పటి టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సమన్లు జారీ అయ్యాయి.. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు నుంచి ఈ సమన్లు జారీ అయ్యాయి… అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ […]
దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు… రేపు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షకు దిగనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటన ప్రకారం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై నిరసన తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రకటనలో పేర్కొన్న మోత్కుపల్లి… దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం, […]