రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని చెబుతుంటారు.. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత.. తెల్లారేసరికి మరో పార్టీలో కనిపించి ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో చూశాం.. అయితే, తెలంగాణలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ.. కానీ, సీఎం కేసీఆర్‌కు చివరకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నా ఫామ్‌హౌస్‌ను ట్రాక్టర్ పెట్టి దుంతాడట.. రా వచ్చి చూడు.. ఆరు ముక్కలు అవుతావంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. నన్ను నరుకుతావా..? నన్ను బూతులు తిడతావా? నన్ను ఆరు ముక్కులు చేస్తావా..? అది కూడా నీ లక్కీ నంబర్.. సిండికేట్ నెంబర్ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. చివరకు నీకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, తెలంగాణ ప్రజల కోసం తల నరికించుకోవడానికైనా నేను సిద్ధం అన్నారు బండి సంజయ్..
Read Also: కేసీఆర్‌ను టచ్ చేసి తీరుతాం.. వీపు మోత తప్పదు..
రైతులు రోడ్లపై వరి ధాన్యం పోసుకొని చూస్తున్నారు.. వరి ధాన్యం కొంటావా? లేదా? స్పష్టం చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు బండి సంజయ్.. ఇక, ష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన.. దళితబంధు అమలను చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు.. దళితులకు పది లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని హెచ్చరించారు.. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ప్రశ్నించిన ఆయన.. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నాం అన్నారు.. కేసీఆర్ మాటలకు భయపడే ప్రసక్తేలేదు.. పోరాటం చేస్తాం.. గద్దె దింపుతాం అంటూ హెచ్చరించారు.