పెళ్లికి రండి.. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి భోజన తాంబూలాలు స్వీకరించి వధువరులను ఆశీర్వదించండి.. సాధారణంగా వివాహ ఆహ్వానాలు ఇలాగే ఉంటాయి.. కొందరు కట్నకానులకు వద్దు మీరు వస్తే అదే చాలు అంటూ కార్డులు ముద్రించేవాళ్లు కూడా లేకపోలేదు.. అయినా.. పెళ్లికి వచ్చినవారు తమకు తోచిన బహుమతి.. లేదా కట్నాలు చదివించడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లికి సాధ్యం కానివారు రిషెప్షన్‌కు హాజరు కావడం.. మిగతాతంతా సేమ్ టు సేమ్ అనే తరహాలో జరిగిపోతున్నాయి.. కానీ, మా పెళ్లికి రండి.. డబ్బులు తీసుకురండి.. ఇంత మొత్తం తీసుకు రండి అంటూ ఆహ్వానం పలికింది ఓ వధువు.. తన పెళ్లికి వచ్చే అతిథులు, బంధువులు 99 డాలర్లు అంటే సుమారు రూ. 7370 చొప్పున తీసుకురావాల్సిందేనంటూ కండీషన్ పెట్టింది.. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్ చేయడానికి తగినంత డబ్బు తమ దగ్గర లేదని.. అందుకే తనకు తలో 99 డాలర్లు ఇవ్వాలని ఆహ్వాన పత్రికలో పేర్కొంది.. ఇక, ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే.. సోషల్ మీడియాకు ఎక్కడం సాధారణమే కాగా.. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వ్యవమారం వైరల్‌గా మారిపోయింది.
ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది వెలుగుచూసింది.. మా వద్ద పెళ్లివేడుకలు నిర్వహించడానికి తగిన డబ్బు లేదు.. పెళ్లికి వచ్చే బంధువులు, అతిథులుకు తలో 99 యూఎస్ డాలర్లు (భారత్ కరెన్సీ ప్రకారం రూ.7370) ఇవ్వాలని కోరుతున్నాం అంటూ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారని వెల్లడించారు.. వివాహానికి వచ్చే అతిథులను మేం ఆహారాన్ని కొనుగోలు చేయలేం.. కావును ఆ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొన్నారు. ఇక పెళ్లి జరిగే ప్రదేశం కూడా చాలా దూరం.. ఇది మా నుండి 4 గంటల ప్రయాణం మరియు పిల్లవాడికి ఉచితం కాబట్టి మేం పెట్రోలు, వసతి, దుస్తులు, బేబీ సిట్టర్ మరియు పెళ్లిలో తినడానికి మా ఆహారం కోసం చెల్లించాలని రాసుకొచ్చారు.. వివాహం జరిగే చోట ఓ బాక్స్ ఏర్పాటు చేసి ఉందని.. దానిపై అతిథులారా మా భవిష్యత్తు, కొత్త నివాసం కోసం దయచేసి డబ్బు విరాళంగా ఇవ్వండి అని రాసిపెట్టి ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చాడు.. అయితే, ఈ మ్యారేజ్ వేడుక అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది.. మరోవైపు ఈ వ్యవహారంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.. అలా అయితే నేను అసలు పెళ్లికే వెళ్లను అని కొందరు.. ఇలా చేసి ఉండాల్సింది కాదు అని.. కొందరు.. వారు చెప్పింది నిజమై కూడా ఉండవచ్చు అని మరికొందరు.. వివాహ భోజనానికి కూడా డబ్బులు అడుగుతారా అని ఇంకా కొందరు కామెంట్లు పెడుతున్నారు.