తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో కశ్మీర్.. భారత్-పాకిస్థాన్ అంతర్గత విషయమని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా కశ్మీర్, భారత్ సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్.. […]
టోక్యో పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖారా మరో పతకాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు.. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని అందుకుని.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇప్పుడు మరో ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.. ఇవాళ జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు అవని లేఖారా.. దీంతో.. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు […]
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో చైనా స్విమ్మర్ రికార్డులు సృష్టించాడు… స్విమ్మింగ్ లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన భూమిక పోషిస్తాయి.. కానీ, రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్ టావో.. ఏకంగా నాలుగు స్వర్ణాలతో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.. విద్యుత్ షాక్ తగలడంతో ఈ చైనాకు చెందిన 30 ఏళ్ల జెంగ్ టావో.. రెండు చేతులు కోల్పోయాడు.. కానీ, ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచ స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు.. ఇక, ఆ తర్వాత.. కూతురా, నన్ను […]
ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. […]
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది… ఇవాళ భారత్ ఖాతాలో మరో పతకం చేరింది… టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది.
భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 366 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 34,791 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య […]
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ మ్యాచ్.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో… 23వేల పరుగులు చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్… వన్డేలు, టెస్టుల్లో కలిపి 23వేల పరుగుల మార్క్‌ను దాటారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ […]
అన్యాక్రాంతం అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేం దుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాలు తొలగించినట్లు దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ గుర్తించి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రాప ర్టీ రిజిస్టర్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 10వేల కోట్ల రూపాయలనేది ఓ వాదన. దీంతో దేవుడి సొమ్మును కొల్లగొట్టిన వా […]
ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆ నిధులను విడుదల చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఎంఎస్ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ. 684 కోట్లు అందించనుంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు ఈ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ. 2,086.42 కోట్లకు చేరనున్నాయి.. పారిశ్రామికాభివృద్దికి […]
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు […]