మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే మద్యం విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు… కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి […]
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. […]
బంగారం కొనాలని చూసేవారికి కాస్త ఊరట లభించింది.. పసిడి ధరలు మరోసారి తగ్గాయి.. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.48,230కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.44,200కు పడిపోయింది.. ఇక, వెండి కూడా బంగారం బాటనే పట్టింది.. రూ.300 తగ్గడంతో కిలో వెండి ధర రూ.68,400కు దిగివచ్చింది. ఇక్కడ ఇలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మాత్రం పైకి […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. […]
రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందైతే అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం… శ్రీకాకుళం జిల్లా అక్కివరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.. మేం శంకుస్థాపనలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని హితవుపలికిన తమ్మినేని సీతారం.. […]
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్‌మీడియా, వెబ్ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా […]
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్‌ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss […]
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరికీ దూరమై 12 ఏళ్లు గడిచింది.. ఆయనను స్మరించుకుంటూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాళులర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఇక, వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్ఆర్తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇప్పటికే సీపీఐ నేత […]
తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ తేదీలను రీషెడ్యూల్ చేశారు అధికారులు.. ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకపోవడం… సీట్ల సంఖ్య ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.. వెబ్ ఆప్షన్స్ ఈ నెల 4వ తేదీ నుండి కాకుండా 11వ తేదీకి రీషెడ్యూల్ చేసిన ఉన్నత విద్యామండలి.. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించింది.. ఇక, ఈ నెల 18న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు […]
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో వైఎస్ చిత్రపటానికి నివాళులుర్పించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే వైఎస్సార్ ఆకాంక్ష అని తెలిపిన రేవంత్… వైఎస్సార్ ఆకాంక్ష నెరవేర్చే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.. ఇక, కృష్ణా నది జలాల పంపకం విషయంలో వివాదాలపై స్పందించిన రేవంత్.. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీ నీళ్లు […]