రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. తగ్గనున్న టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పెట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టింది.. క్రమంగా కొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కోవిడ్ సమయంలో రైలు టికెట్ల ధరలు కూడా పెరిగి ప్రయాణికులకు భారంగా మారాయి. అయితే, రైళ్లలో కరోనాకు ముందున్న చార్జీలను అమలుచేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. లాక్‌డౌన్‌లు, కోవిడ్ నిబంధనల కారణంగా రైల్వే శాఖ సర్వీసులను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే కాగా… కొంతకాలంగా స్పెషల్ ట్రైన్‌ల పేరుతో పరిమితంగా మాత్రమే సేవలను అందిస్తోంది. అలాగే ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, అనవసరపు ప్రయాణాలను తగ్గించడానికి పెంచిన చార్జీలను కూడా తగ్గించనున్నారు.. తక్షణమే పాత చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది రైల్వే బోర్డు.
మరోవైపు.. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వేశాఖ.. రైళ్ల నంబర్లకు ముందు సున్నా ఉండేలా చర్యలు తీసుకుంది.. అయితే ఇప్పుడు పాత నంబర్లతోనే రైళ్లు తిరగనున్నాయి.. ఇక, రైల్వే చార్జీలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, స్పెషల్ క్లాస్ ప్రయాణీకులకు కరోనాకు ముందున్న మాదిరిగానే చార్జీల్లో రాయితీలను పునరుద్ధరించనున్నట్టు వెల్లడించారు… రెండు మూడు నెలల్లో రైల్వే సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు.. అయితే, జోన్ల పరిధిలో ఎప్పటి నుంచి రెగ్యులర్ సర్వీసులను నడపాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని అధికారులు చెబుతున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!