మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కీలక నేతలు ప్రాణాలు వదులుతున్నారు.. తాజాగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతిచెందారు.. బాణం బాంబులను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఆయన ప్రాణాలు విడిచినట్టుగా చెబుతున్నారు.. మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ టీం సభ్యులుగా ఉన్న రవి.. ఇంఛార్జ్‌గా కూడా వ్యవహరించారు.. అయితే, ఏడాది క్రితం ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుండగా.. మావోయిస్టు కేంద్ర కమిటీ తాజాగా ధృవీకరించింది.. జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి.. కమ్యూనికేషన్స్ తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో దిట్టగా చెబుతున్నారు.. ఇప్పటి వరకు ఆ ఘటనపై క్లారిటీ లేదని.. ఇప్పుడు స్పష్టత రావడంతో అధికారిక ప్రకటన విడుదల చేసినట్టు మావోయిస్టులు చెబుతున్నారు.