తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 68,097 శాంపిల్స్ పరీక్షించగా… 298 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 325 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,142కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,50,778కు పెరిగింది. ఇక, […]
ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఈ చర్చ సాగుతోంది.. తాజాగా.. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. ఇక, తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది… తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు […]
తెలంగాణ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ […]
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించనుంది.. ఇక, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలక తీసుకుంది తెలంగాణ ఉన్నత విద్యా […]
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… రేపటి నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ […]
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్నాయి.. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని పేర్కొంది.. కేవలం ట్యూషన్ […]
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలో విస్తారంగా.. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న ఏర్పడే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతానికి ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతోందని.. […]
వినాయక చవితి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది… సీఎం వైఎస్ జగన్, ఏపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… ఇక, వ్యవహారంలో సీఎం జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి కిడారి.. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. కులాలు, మతాల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.. వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించిన ఆయన.. తల్లిదండ్రులు వద్దంటున్నా […]
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయవారసుడిపై అప్పడప్పుడు చర్చ తెరపైకి వస్తూనే ఉంటుంది… ఏ ఎన్నికలు వచ్చినా.. ఇదిగో ఈ ఎన్నికల తర్వాత కాబోయే సీఎం కేటీఆరే నంటూ విమర్శలు వచ్చిన సందర్భాలు ఎన్నో.. ఇక, అంతా అయిపోయేది.. కేటీఆర్ సీఎం అవుతున్నారంటూ ప్రచారం సాగిన సందర్భాలు అనేకం.. మరికొందరు కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయన మేనల్లుడు హరీష్‌రావు అనేవారు లేకపోలేదు.. కేటీఆర్ కంటే హరీష్‌రావు సీనియర్ అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే […]
నకిలీ చనాల్ల స్కామ్ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారులు నకిలీ చలానాలతో కోట్ల రూపాయిలు అక్రమంగా కూడబెట్టారన్న వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు కూడా తీసుకున్నారు.. ఇప్పటికే కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు అధికారులు.. మరోవైపు.. నకిలీ చలాన్ల స్కామ్ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. […]