ఏపీ మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇప్పటికే హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని… ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కోర్టుకు విన్నవించారు. అయితే, రాజధాని కేసులపై సోమవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు ధర్మాసనం.
Read Also: కలవరపెడుతోన్న కోవిడ్ కొత్త వేరియంట్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
Also Read
ఇక, ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం.. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును అఫిడవిట్‌కు జత చేసి హైకోర్టుకు ఇచ్చింది వైఎస్ జగన్ సర్కార్.. బిల్లు కాపీలతోపాటు.. అసెంబ్లీ, మండలిలో జరిగిన ప్రొసీడింగ్స్ కాపీలను కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం.. రూల్ 123 ప్రకారం అసెంబ్లీలో, రూల్ 147 ప్రకారం మండలిలో రద్దు బిల్లు ఆమోదం పొందిందంటూ స్పీకర్ తమ్మినేని, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సంతకాలతో కూడిన మెసేజ్ కాపీలని కూడా కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం.. అయితే, విచారణ కొనసాగింపుపై హైకోర్టు ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!