ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకంపై ఈ నెల 20న సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను ఆహ్వానించింది. ఆన్లైన్లో టిక్కెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనుంది. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు.. సినీ ప్రముఖులు, థియేటర్ ఓనర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని […]
తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ కు గజ్వేల్ సిద్దమైంది. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిర్యాలలో దళితుల సమస్యలపై సభలు నిర్వహించిన కాంగ్రెస్.. సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని… గజ్వేల్ లో సభ ఏర్పాటు చేస్తోంది. లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. పిసిసి లో కొంత మంది నాయకులు .. గజ్వేల్ లో సభ ఎందుకు… హుజురాబాద్ లో పెడితే ఎన్నికలకు అక్కరకు వస్తుందని పార్టీ నేతలు సూచించారు. అయితే… గజ్వేల్‌లో సభ […]
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరిగాఇంది.. మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం దాదాపు ఆరుగంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది. మొదటగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ లో చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలల్లో […]
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రేపు నిర్మల్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్‌షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాధులు. వెయ్యి ఉరుల మర్రి సమీపంలో భారీబహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి నాందేడ్ రానున్న ఆయన.. అక్కడ నుంచి నిర్మల్ వస్తారు.. వెయ్యి […]
చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా లైంగికదాడులు జరుగుతున్న ఘటనలు అనేకం.. కొత్త చట్టాలు వచ్చినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుఅదుపుఉండడం లేదు.. అయితే, హైదరాబాద్‌లో ఓ బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.. రూ.10వేలు జరిమానా కూడా విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే తొమ్మిదేళ్ల బాలుడిని.. పాతికేళ్ల వయస్సు గల ఆయా లైంగిక వేధింపులకు […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. భారత్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఫస్ట్‌వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.. ప్రాణనష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది.. అయితే, ప్రస్తుతం కరోనా రోజువారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది.. కానీ, మళ్లీ ముప్పు పొంచేఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం.. […]
ఢిల్లీ పర్యటనలో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామి.. వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.. బుధవారం రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ ఆహ్వానించిన ఆయన.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.. ఈ సందర్భంగా గంటకుపైగా అమిత్‌షాతో చర్చలు జరిపారు.. చిన్నజీయర్ తో పాటు […]
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్లో ప్రస్తావించినట్టుగానే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాడ్‌బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30,600 కోట్ల గ్యారెంటీ ఇస్తోందని ప్రకటించారామె.. బ్యాంకింగ్‌రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. ఇప్పుడిప్పుడే బ్యాంకింగ్ రంగం కోలుకుంటుందన్నారు.. ఇక, ఎన్పీఏలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని […]
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 శాంపిల్స్ పరీక్షించగా.. 259 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్‌బారినపడి మృతిచెందగా.. 301 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,785కు చేరగా.. రికవరీ కేసులు 6,53,603కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,900 మంది ప్రాణాలు […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఎన్నికలపై హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.. మరోవైపు.. వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సమాచారం.. ఇప్పటి నుంచే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల కోసం వచ్చే ఏడాది నుంచి అంతా రంగంలోకి దిగాలని కూడా పీకే టీమ్‌ను ఆదేశించినట్టు సమాచారం.. వచ్చే ఏడాది నుంచి […]