తెలంగాణలో త్వరలోనే బార్ లైసెన్స్‌ల గడువు ముగియనుంది.. ఇక వైన్ షాపుల గడువు వచ్చే నెల ముగియబోతోంది.. ఈ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీపై సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీతో బార్ల లైసెన్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. 2021 – 22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించి చర్చించారు.. ఇక, ఏ4 వైన్ షాప్ ల లైసెన్సుల గడువు […]
సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటనను సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. ఘటన జరిగిన తర్వాత పరారైన రాజు కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.. నిందితుడికి మద్యం అలవాటు ఉండడంతో.. అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాల వద్ద నిఘా కూడా పెట్టారు.. ఇక, ఈ నేపథ్యంలో.. అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.. జిల్లాలోని అన్ని […]
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో.. జీహెచ్ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ ఏడాది నిమజ్జనాలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపట్టనుంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. […]
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా… పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాల కోసం కొత్త ఛానల్‌ను ప్రారంభించింది కేంద్రం. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభా స్పకీర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ… సంసద్ టీవీని ప్రారంభించారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభ పేర్లతో రెండు ఛానల్స్ ఉండేవి. ఆ రెండింటినీ సంసద్ ఛానల్లో విలీనం చేశారు. దేశ పార్లమెంట్ వ్యవస్థలో సంసద్ టీవీ…ముఖ్యమైన చాప్టర్‌గా మిగిలిపోతుందన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృతస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్ […]
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది.. కొత్త సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.. అయితే, సాంకేతికంగా టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 80కి చేరుకుంది.. టీటీడీ ఛైర్మన్‌తో పాటు 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్అఫిషియో సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80కి చేరుకుంది టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య.. టీటీడీ కొత్త పాలకమండలి పేర్లు […]
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,323 శాంపిల్స్ పరీక్షించగా.. 324 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారిబారినపడి మరొకరు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో.. 280 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 6,53,302కు పెరిగింది.. కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 3,899కు చేరిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో […]
చంద్రబాబు, లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెన్షన్ల విషయంలో ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నాం.. సుమారు 3 లక్షల పెన్షన్లని వెరిఫికేషన్ కోసం పెట్టారని.. 3 లక్షల పెన్షన్లను తొలగించినట్టు కాదు.. ప్రస్తుతం జరిగేది పరిశీలన మాత్రమే అని.. ఇందులో కూడా అర్హులైన వారికి పెన్షన్ అందుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక, కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి ఘటన అందరినీ కలచివేస్తోంది.. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి, ధైర్యాన్ని చెప్పగా… ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్కడే దీక్షకు దిగారు.. అయితే, రాత్రికి సింగరేణి కాలనీకి చేరుకున్నారు వైఎస్ షర్మిల.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. షర్మిలతోపాటు దీక్షలో కూర్చున్నారు. కాగా, ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణా బేసిన్లో జల జగడం తారాస్థాయికి చేరుకోగా.. గోదావరి బేసిన్లోనూ పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.. దీంతో.. ఇరు రాష్ట్రాల మధ్య జలజగడానికి ముగింపు పలుకుతామంటూ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.. ఇది, కొన్ని కొత్త సమస్యలకు కూడా కారణమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 17వ తేదీన గోదావరి నదీ యాజమాన్య […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప ఘటన విషయంలో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. వరుసగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న నేతలు.. నిందితుడుని పట్టుకోవడానికి ఇంత సమయం పడుతుందా అని నిలదీస్తున్నారు. మరోవైపు.. నిందితుడు రాజు కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగోతంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తం చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ఇక, నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో.. రాష్ట్రంలోని 2200 మద్యం షాపు యజమానులను కూడా అప్రమత్తం చేశారు […]