ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప.. ఎన్నికలు వచ్చిన సమయంలో ఏ పార్టీ ఏ పార్టీతోనైనా కలవొచ్చునని కామెంట్ చేసిన ఆయన.. జనసేనతో టీడీపీ పొత్తుపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం ఉంటుందన్నారు.
Read Also: ఓ ఇంటివాడైన తేజస్వి యాదవ్.. బాల్య స్నేహితురాలితో పెళ్లి
అయితే, పొత్తుపై నిర్ణయం తీసుకునేది మేం కాదని.. పొత్తు నిర్ణయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చర్చించి తీసుకుంటారని వెల్లడించారు.. ఇక, కులాలతో సంబంధం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఓ పార్టీకి బలం చేకూర్చి రాజకీయం చేయాలన్నారు నిమ్మకాయల చినరాజప్ప. అయితే, చినరాజప్ప వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.