తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు.. పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.. కొన్ని చోట్ల భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడిప్పుడే కాస్త తెరపి ఇస్తుండా.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్సాలు ఒకటి, రెండు చోట్ల.. ఎల్లుండి కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ కేంద్రం.. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన […]
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది… పరిపాలన చేతకానివాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్… కొంతమంది కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.. వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, […]
రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి, పార్టీ శ్రేణుల దుస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. పార్టీలో కాకరేపారు.. కొందరని ఉద్దేశిస్తూ పరోక్షంగా జేసీ కామెంట్లు చేయడంతో ఆ నేతలను నొచ్చుకున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో పెద్దపప్పూరు మండలం జూటూరులోని తోటలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కలిశారు శింగనమల తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ […]
ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు ఇప్పుడు అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి.. కీలకస్థానాల్లో ఉన్న నేతలే అలకబూనడం తాలిబన్లకు సమస్యగా మారింది.. అయితే, తాలిబన్ల కేబినెట్లో ఉన్నవారంతా కరడుగట్టిన ఉగ్రవాదులే.. హక్కానీ నెట్వర్క్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు… అయితే, కేబినెట్లో చోటు విషయంలో ఆచరణవాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు ప్రచారం సాగింది.. ఇరు వర్గాల మధ్య దేశాధ్యక్ష భవనంలో పెద్ద గొడవ జరిగిందని.. ఆ ఘర్షణలో ఆచరణవాదుల వర్గానికి నేతృత్వం […]
కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్లో జెండా ఎగరేసిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి అప్పటి ప్రధాని నెహ్రూ సహకరించారని తెలిపారు.. హోంమంత్రికి ప్రత్యేక నిర్ణయాలు ఉండవు.. ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూదేనని స్పష్టం చేశారు.. కానీ, కొందరు ఇది హోం మంత్రి నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన.. కాంగ్రెస్ పూర్వీకుల […]
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… నిందితుడూ ఎంతకీ దొరకకపోవడంతో.. పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు.. అన్ని జిల్లాలలను అప్రమత్తం చేశారు.. నిందితుడి చిత్రాలతో పాటు, ఊహా చిత్రాలను కూడా విడుదల చేసి అలర్ట్ చేశారు.. ఇక, నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో.. మద్యం షాపుల నిర్వహకులకు కూడా నిందితుడి ఫొటోలు పంపించి అలర్ట్ చేశారు.. అయితే, నిందితుడు రాజు పోలీసులకు చిక్కుండానే రైలు […]
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ విలీనమా..? విమోచనమా? అనే చర్చ సాగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుంటే.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం విమోచన దినంగా పాటిస్తోంది.. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన గవర్నర్ తమిళిసై.. “సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు […]
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైరింజన్ల సమాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. అయితే, గోదాంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీల సహాయంతో గోడలు కూల్చివేస్తున్నారు అధికారులు.. గోదాంలో పిచికారీ మందులు మరియు సీడ్స్ ఉన్నట్లుగా […]
ఈ మధ్య మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి… పెద్ద సంఖ్యల్లో మావోయిస్టులు లొంగిపోతున్నారు.. మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారినపడినట్టు ప్రచారం జరిగింది. కొంతమంది ఆస్పత్రిల్లో చేరి కూడా పోలీసులకు చిక్కారు.. తాజాగా మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్ భార్య శారద లొంగిపోయారు.. గత కొంత కాలం నుంచి పార్టీకి హరి భూషణ్ కుటుంబం దూరంగా ఉంటోంది… కొన్ని రోజుల క్రితమే హరి భూషణ్ కుమారుడు లొంగిపోగా.. తాజాగా, ఖమ్మం పోలీసుల ముందు హరిభూషణ్ భార్య శారద […]