ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు హీట్ పెంచాయి… ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. సీఎం వైఎస్ జగన్.. మంత్రులు, డీజీపీ.. ఇలా.. అందరినీ వరుసపెట్టి కామెంట్ల్ చేశారు.. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. ఇవాళ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ముట్టడికి కూడా వెళ్లారు.. అయితే, తన కామెంట్లపై మరోసారి స్పందించిన అయ్యన్నపాత్రుడు.. నేను మాట్లాడింది చూడండి.. ఎక్కడైనా తప్పు మాట్లాడానా? అని ప్రశ్నిస్తూనే.. […]
ఆంధ్రప్రదేశ్‌కు మరో 30 సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.. ఎవ్వరు ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ రఘురామకృష్ణంరాజు చేత బెయిల్ రద్దు పిటిషన్ వేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరన్నారు.. స్థానిక సంస్థల […]
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం.. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా… నిర్మల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత […]
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన కలకలం సృష్టించింది.. ఇక, కేసులు నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే, నిందితుడు రాజు ఆత్మహత్యపై అనుమానాను వ్యక్తం చేస్తూ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. రాజు ఆత్మహత్య ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వరీకి ఆదేశించింది… దీనికి వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ను జుడిషియల్ అధికారిగా నియమించింది తెలంగాణ హైకోర్టు.. నాలుగు […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ప్రచా చార్జిషీట్ పేరుతో ఓ పత్రాన్ని విడుదల చేసింది టి.పీసీసీ.. దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారికి నష్టం కలిగించారంటూ.. ఆ చార్జిషీట్లో సీఎం కేసీఆర్‌ను ఏ1గా చేర్చారు.. ప్రజాకోర్టులో నెంబర్ 1 దోషి కేసీఆర్‌కు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగంపైన ప్రమాణం చేసి తాను ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం నేరం. .అందుకే కేసీఆర్ నేరస్థుడు […]
మావోయిస్టు కీలక నేత హరిభూషన్ భార్య సమ్మక్క అలియాస్ శారద లొంగిపోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… 1994లో 18 ఏళ్ల వయస్సులోనే పాండవ దళంలో కమాండర్‌గా పనిచేస్తున్న హరిభూషన్… శారదను మైనర్‌గా ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె కిన్నెర దళంలో 1997 నుండి 1998 వరకు పనిచేసిందని వెల్లడించిన ఆయన.. 1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ మెంబర్‌గా… ప్లాటున్ మెంబర్‌గా పనిచేశారన్నారు.. 2008లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయిన […]
హైదరాబాద్‌లో వరుసగా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూ కలవరపెడుతున్నాయి… తాజాగా, ఓల్డ్‌సిటీలో మరో ఘటన బయటపడింది.. తమ్ముడి భార్యపై కన్నేసిన ఇర్ఫాన్ అనే వ్యక్తి.. ఆమెను లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.. విషయం పోలీసులకు గానీ, బయట ఎవ్వరికి చెప్పినా చంపేస్తానంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేశాడు.. అంతేకాదు.. పలుమార్లు దాడులు కూడా చేసినట్టు బాధిత మహిళ చెబుతోంది.. మూడు నెలలపాటు ఇర్ఫాన్ చిత్రహింసలను మౌనంగా బరించిన ఆ మహిళ.. చివరకు కుటుంబపెద్దల సహకారంతో.. భరోసా […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబాబు తీవ్రంగా స్పందించారు.. కోడెల వర్ధంతి కార్యక్రమంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెన్నకి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టిందని.. అధికారంకోల్పోయి అవాకులు […]
భారత్ దృష్టి మొత్తం ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపైనే ఉంది… లక్నో వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సహా.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొంటున్నారు.. అయితే, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. 11 రకాల కోవిడ్ ఔషదాలపై పన్ను రాయితీలను పొడిగించే అవకాశం ఉంది.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. […]