వ్యవసాయ మంత్రి బహిరంగ లేఖ.. యాసంగిలో వరి వద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది… ఈ మేరకు తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం.. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది.. కానీ, కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. సాగుభూమి ఏడేండ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేర్చారని తెలిపారు.. సీఎం కేసీఆర్ విధానాలతో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని పేర్కొన్న ఆయన.. 2020-21 నాటికి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో తలోమాట చెబుతున్నారని.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇంకో మాట చెబుతున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించిన ఆయన.. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: టీడీపీ-జనసేన పొత్తు..! సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.. 14 ఏళ్ల సుధీర్ఘ ఉద్యమం అనేకమంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.. ఆరు దశాబ్దాల పాటు సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం నష్టపోయిందని, 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగా బలోపేతం చేయాలని యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మూడున్నరేళ్లలో ప్రపంచంలో అతి పెద్ద కాళేశ్వరరావు ఎత్తిపోతల పథకం నిర్మించారని.. సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన రైతాంగానికి సాగు నీరు అందించడం ఒక్కటే మార్గం కాదని ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచారని తెలిపారు.. దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం అధిక మద్దతుధర ఇచ్చి దొడ్డు వడ్ల సాగును ప్రోత్సహించింది .. బాయిల్డ్ రైస్ ను సేకరించింది.. కానీ, ఇప్పుడు హఠాత్తుగా నిల్వలు పేరుకుపోయాయని బాయిల్డ్ రైస్ సేకరించలేమని స్పష్టం చేసిందన్నారు.. ధాన్యం సేకరణకు కేంద్రానికి రాష్ట్రం ఎంతో సహకరిస్తుంది.. కొనుగోలు చేసిన ఆరు, ఎనిమిది నెలల తర్వాత కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుందన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం వడ్డీలు భరిస్తూ పది రోజులలో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ గోదాంలతో పాటు పాఠశాలలు, పత్తి మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, రైతువేదికలలో ధాన్యం నిల్వకు ఇచ్చి సహకరిస్తుంది.. మద్దతుధర ఇవ్వడం, పంటలు సేకరించడం కేంద్ర ప్రభుత్వ విధి .. ఇది దశాబ్దాలుగా సాగుతున్నది.. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతాకుమార్ కమిటీ ధాన్యం ఎగుమతులు చేయాలని , పంటలన్నీ సేకరించాలని చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. కేంద్రం మోసపూరిత విధానాలు పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా ఆరుతడి పంటల వైపు మల్లాలని రైతులను అప్రమత్తం చేస్తున్నది.. కేంద్రం కార్పోరేట్లకు ఇస్తున్న సహకారం రైతాంగానికి ఇవ్వడం లేదు.. తెలంగాణ రైతాంగం కేంద్రం అవలంభిస్తున్న భిన్న వైఖరులు గమనించాలి.. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!