భారత్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 116 మంది […]
భారత క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది బీసీసీఐ.. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఇక, ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి… టీ-20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేశాయనున్నారు.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ, జయేషా.. దీనిపై చర్చించారు… ఇక, పరాస్ మాంబ్రేను […]
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. రక్త సంబంధ ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితమే క్లింటన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర […]
మావోయిస్టు అగ్ర నేతలు ఒక్కొక్కరు కన్నుమూస్తున్నారు.. మరికొందరు అనారోగ్య సమస్యలతో జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.. తాజాగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్య సమస్యలతో.. అది కూడా సరైన మందులు, వైద్యం అందకి కన్నుమూయడం చర్చగా మారింది.. దండకారణ్యంలో గత రెండేళ్లలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారన్నారు దంతేవాడ పోలీసులు. రామన్న, హరిభూషణ్, రామకృష్ణలు తీవ్ర అనారోగ్యంతో బారినపడి.. తుదకు ప్రాణాలు విడిచారన్నారు. వరుసగా అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతుండడం చూస్తుంటే.. మావోయిస్టు పార్టీ తుదిదశకు […]
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి […]
కరోనా పోవాలి.. మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి.. అన్ని పండులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు.. అయితే, కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపిన ఆమె.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని.. […]
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మహన్మోహన్ సింగ్.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయనను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యవహరించిన తీరుపై మన్మోహన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించిన సందర్భంగా మన్మోహన్ తో మంత్రి మాండవీయ ఫొటోలు తీయించుకోవడాన్ని తప్పుబట్టారు.. ఆ ఘటనపై మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.. తన తండ్రి, మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. ఆయనను […]
ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా […]
విజయ దశమి రోజు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సెక్రటేరియట్, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరించారు.. ఉద్యోగుల ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం.. సీఎం వైఎస్ జగన్‌ను కోరారు.. సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించిన సీఎం జగన్… వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.. ఈ […]
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇక, కోస్తాలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారుల వేటపై నిషేధం విధించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.. జిల్లాలోని 13 […]