దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ).. నందమూరి బాలకృష్ణ లవ్‌లో పడిపోయారు.. అదేంటి? బాలయ్యతో ఆర్జీవీ లవ్ ఏంటి? అనుకుంటున్నారేమో… ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోతో ప్రేమలో మునిగితేలుతున్నారు ఆర్జీవీ.. టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.. మోహన్‌బాబు ఫ్యామిలీ, దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రవితేజ, రానా, నాని, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి.. ఇలా చాలా మందిని తన షోకు ఆహ్వానించిన బాలయ్య.. వారితో చేసిన హడావుడి మామూలుగా లేదు.. అదే.. ఆహాకు మంచి వ్యూస్ కూడా తెచ్చి పెడుతోంది..
Read Also: గండ్ర దంపతులకు కోవిడ్.. మంత్రులకు టెన్షన్..!
అయితే, తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్‌స్టాపబుల్ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.. దేనికి అంత ఈజీగా టెంట్ కానీ ఆర్జీవీ.. ఉన్నట్టుండి బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న ఆ పోగ్రామ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.. అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌ని అందనంత ఎత్తుకు ఎత్తేశారు.. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసలు కురిపించారు.. అంతేకాదు.. నాకు కూడా ఓ అవకాశం ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.. ఇప్పటికే ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా కూడా రికార్డు సృష్టించిన ఈ షోపై ఆర్జీవీ మనసు పారేసుకోవడంతో.. ఆయన్ను బాలయ్య ఆహ్వానిస్తారా? ఒకవేళ అవకాశం వస్తే వీరి ఇద్దరి మధ్య సంభాషణ ఎలా జరగబోతోంది.? వీరిద్దరి ఎపిసోడ్ హైలెట్‌గా నిలవనుందా? అనేదా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.