కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ నుంచి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కోవాగ్జిన్, కోవీషీల్డ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంచుకుంది.. ఇక, ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లకు సైతం ఆమోదం తెలిపింది కేంద్రం.. దీంతో.. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయతే, భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, త్వరలోనే తేల్చేందుకు మాత్రం […]
ఉత్తరప్రదేశ్ లో జరిగిన లఖింపూర్ ఘటన దేశవ్యాపితంగా పెను దుమారమే లేపింది… యోగి సర్కార్ నుంచి మోడీ సర్కార్ వరకు.. అందరిపై విమర్శలు, ఆరోపణలు పెరిగి పోయాయి.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప.. విచారణ ముందుకు సగలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.. అయితే ఈ కేసులో దర్యాప్తు పట్ల భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేయాలి. […]
కోర్టులోనే దారుణం జరిగింది.. ఓ లాయర్ ను నాటు తుపాకితో కాల్చి చంపారు దుండగులు… ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల లోకి వెళ్తే షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. ఆయన మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు భద్రతా లోపం వల్లే […]
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి […]
కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్ […]
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరారు.. మరోవైపు.. తాను కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షురాలిగా లేనని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే […]
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్‌పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు, […]
భారత్‌లో ఇప్పుడు విద్యుత్ సంక్షోభంపై విస్తృతంగా చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్ కష్టాలు తప్పవనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా.. విద్యుత్ సంక్షోభం లాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఇక, దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని… రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేసిన ఆయన.. నిధులు ఎంతైనా వెచ్చించి విద్యుత్ […]
మావోయిస్టు టాప్ లీడర్ ఆర్కే.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని ఆ పార్టీ నేత అభయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు మావోయిస్టులు.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు.. […]
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చిలి శశికళ మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్నారనే చర్చ సాగుతోంది.. ఇవాళ చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్ సమాధుల దగ్గర నివాళులర్పించిన శశికళ.. జయ స్మారకం వద్ద భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఇక, అన్నా డీఎంకే జెండాను మాత్రం వదలడంలేదు శశికళ.. గతంలో ఆమె జైలు నుంచి విడుదలై.. తమిళనాడుకు వస్తున్న సమయంలోనూ జయలలిత ఫొటోలు, అన్నా డీఎంకే జెండాలతో ఆమెకు స్వాగతం లభించింది.. […]