దుర్గామాత నిమజ్జ యాత్రపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్లే ఇవాళ ఉదయం.. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు భక్తులు.. పాటలు పాడుతూ.. ఊరేగింపు సాగుతోన్న సమయంలో.. వేగంగా దూసుకొచ్చిన ఎస్యూవీ కారు.. ప్రజలపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు. also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 […]
మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిపై ఉద్యమనేతలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతంలో కన్నుమూశారు.. ఇప్పటికే ఆర్కే అనారోగ్య సమస్యలపై మృతిచెందినట్టు ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించగా.. తాజాగా.. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే మరణించినట్లు సమాచారం అందిందని.. ఆ ప్రకటలో తెలిపారు ఐజీ సుందర్రాజ్.. అనారోగ్యంతోనే ఆర్కే మృతిచెందినట్లు సెంట్రల్ కమిటీ […]
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాయి.. రెండు రోజుల పర్యటన కోసం గురువారం రోజు తిరుపతికి వచ్చిన ఆయన.. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని మొదట దర్శించుకున్నారు.. ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు.. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చక్రస్నానం ఘట్టంలో పాల్గొన్న ఆయన.. మూల విరాట్ అభిషేకం […]
విజయ దశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వమించారు.. ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్…సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన.. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతులు, హిమాన్షు, […]
దసరా పండుగను అంతా ఘనంగా సెలబ్రేట్ చేస్తే.. ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం కర్రల సమరం జరుగుతోంది.. కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం నిర్వహిస్తున్నారు.. అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.. ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి ఊర్లకు ఊర్లే తలపడతాయి.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. ఈ ఉత్సవంలో పాల్గొంటారు.. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, […]
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణం అందరినీ కదలిస్తోంది.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంలో విప్లవోద్యమంలో పనిచేసిన ఆయన.. చివరకు ఆ అడవి తల్లి ఒడిలోని కన్నుమూశారు.. అయితే, ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆర్కేతో నాకు 1994 నుంచి పరిచయం ఉందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకన్న ఆయన.. వివిధ అంశాల్లో కేంద్ర కమిటీ సూచించిన డైరెక్షన్ లో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. […]
ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాందహార్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16 […]
అస్వస్థతకు గురైన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఎయిమ్స్ వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాగా, అస్వస్థతకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఈ నెల 13వ తేదీన ఎయిమ్స్ చేరారు.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు కాంగ్రెస్ […]
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది.. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో 15 నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.. […]
తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది… ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై జీడివాగు వద్ద రేగా కాంతారావు కారు బోల్తా పడింది… బైక్‌ని ఓవర్ టెక్ చేయబోయిన సమయంలో.. కారు అదుపుతప్పి చెట్టుకుని ఢీకొట్టింది.. ఆ తర్వాత రోడ్డుకిందకి దూసుకెళ్లి బోల్తా పడింది.. ఈ సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, ప్రమాదం సమయంలో కారులో రేగా కాంతారావు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.