మావోయిస్టు అగ్రనేత ఆర్కేఅనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్కేగా సుపరిచితులైన అక్కిరాజు హరగోపాల్ ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్ అడవుల్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు కూడా ధ్రువీకరించారు. దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులున్నాయి. అలిపిరి దగ్గర 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు ఆర్కే. బలిమెల ఎన్కౌంటర్ నుంచి ఆర్కే తృటిలో తప్పించుకోగా.. ఈఘటనలో ఆయనకు బుల్లెట్ గాయమైంది. […]
సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్ఎఫ్కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్ఎఫ్కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ […]
దేశవ్యాప్తంగా విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్‌మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్టు-2015, మైన్స్, మినరల్స్ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం […]
ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక, […]
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఇక లేరని చెబుతున్నారు పోలీసులు.. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆర్కే.. ఇవాళ కన్నుమూశారని తెలుస్తోంది.. ఇక, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు రామకృష్ణ.. చాలా సమయాల్లో పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? […]
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా […]
తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు దివంగత సీఎం జయలలిత (అమ్మ) ఇష్టసఖి శశికళ (చిన్నమ్మ).. దానికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.. అదే రోజు పొలిటికల్ రీ ఎంట్రీకి శశికళ రంగం సిద్ధం చేసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది.. ఆ రోజు మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధిని సందర్శించేందుకు పోలీసు భద్రత కావాలని శశికళ అనుచరులు కోరారట.. దీంతో.. […]
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్ పాస్ ఆఫర్… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్ మెట్రోల్ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం […]
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం […]