Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది : నిహారిక కొణిదెల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిహారిక కొణిదెల నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిహారిక ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ‘పదే పదే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో..
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘మా ‘పదే పదే’ సాంగ్‌ని కాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఈ కాలేజ్‌లో పెడితే బాగుండనిపిస్తోంది. మనం ప్రేమ గురించి ఎప్పుడూ ప్రాధేయపడకూడదు. మనమే ప్రేమలా మారిపోవాలి. అదే మా ఈ ‘పదే పదే’ పాట. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఏప్రిల్ 3న మా మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
Also Read
- YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
- YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘‘మ్యాడ్’ తరువాత ఎలాంటి కథ చేయాలా? అని అనుకుంటున్న టైంలో మానస శర్మ గారు ఈ కథ చెప్పారు. ఆడియెన్స్‌కి మంచి కథలు, మంచి సినిమాలు ఇవ్వాలని మానస గారు ముందే చెప్పారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుంది. ‘రపప్పా.. రపప్పా’ బ్లాక్ బస్టర్ తరువాత ‘పదే పదే’ పాట వచ్చింది. ఈ పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మా అందరికీ ఈ పాట చాలా ఫేవరేట్. హీరోయిన్, గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాట అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి. సినిమా రిలీజ్ తరువాత మళ్లీ ఈ కాలేజ్‌కి వచ్చి అందరినీ కలుస్తాను’ అని అన్నారు.
నయన్ సారిక మాట్లాడుతూ .. ‘‘పదే పదే’ పాటను నేను లూప్‌లో వింటూనే ఉన్నాను. గర్ల్స్ ఎక్కువగా ఏదీ కూడా బయటకు ఎక్స్‌ప్రెస్ చేయరు. అలాంటి వారికి ఈ పాట చాలా నచ్చుతుంది. ఏప్రిల్ 3న మా ‘రాకాస’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘మా ‘రాకాస’లోని ‘రపప్పా.. రపప్పా’ బాయ్స్‌కి డెడికేట్ చేస్తున్నాను. మా ‘పదే పదే’ పాటను అమ్మాయిలకు డెడికేట్ చేస్తున్నాను. అమ్మాయిలు ప్రేమను వ్యక్త పర్చాలని అనుకుంటే ఈ పాటను వాడుకోవచ్చు. ఏప్రిల్ 3న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య