దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రచారం చేస్తున్నారు. ఒకే వర్గం ఓటర్లను ఆర్షించడం కాదు.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పిస్తున్నారు.. Read Also: ధాన్యం సేకరణపై పటిష్ట విధానం.. సీఎం ఆదేశాలు గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే […]
ధాన్యం సేకరణ, కొనుగోళ్ల పై మంత్రుల బృందంతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. కీలక సూచనలు చేశారు.. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు.. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోళ్ళు జరగాలని.. మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలని.. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండాలన్న ఏపీ సీఎం.. పేమెంట్స్‌లో మోసాలు లేకుండా […]
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.. మరికొన్ని గంటల్లో ఫలితం కూడా వెలువడనుంది.. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు దూరంగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థులను పోటీకి పెట్టాయి.. ఇక, బీజేపీ అభ్యర్థిని టీడీపీ, జనసేన సహకరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఏకంగా కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్చల్ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ రిస్థితి […]
నా చర్మంతో సీఎం వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తాజాగా ఆయన శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ఇక, వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు.. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. ఈ పరిణామంపై కొన్ని విమర్శలు వచ్చాయి.. […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెర పడేలా కనిపించడం లేదు.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారానికి ఇటు కృష్ణానది యాజమాన్య బోర్డు, అటు గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలను నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసినా.. ఇంకా పులిస్టాప్ పడే దాఖలాలు కనిపించడంలేదు.. ఇవాళ కేఆర్ఎంబీకి మరో లేఖరాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. రాజోలిబండ హెడ్ వర్క్స్ ను కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి […]
దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరు, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసింది సీబీఐ.. కాంట్రాక్టర్ల నుంచి ఈఈ రూ.1.29కోట్ల లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపింది.. దక్షిణ మధ్య రైల్వే బెంగళూరు ఈఈ ఘన్ శ్యాం ప్రధాన్‌తో పాటు.. గుత్తేదార్లు ఎం.సూర్యనారాయణరెడ్డి, వంగల సూర్యనారాయణరెడ్డిపై కేసులు నమోదు చేసింది సీబీఐ.. ఇక, ఇవాళ దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేపట్టారు సీబీఐ అధికారులు.. నంద్యాల, రంగారెడ్డి జిల్లా, బెంగళూరు, హుబ్లీ, సంగ్లీ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించాయి […]
పాట్నా పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు.. 2013 పాట్నాలోని గాంధీ మైదాన్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు.. ఈ కేసులో 10 మంది నిందితుల్లో తొమ్మిది మందిని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు అక్టోబర్ 27న దోషులుగా నిర్ధారించింది. ఇక, ఇవాళ వారికి శిక్షలు ఖరారు చేసింది.. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించగా, ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల […]
భారత్‌లో దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చినా.. కోవాగ్జిన్‌కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో.. ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి విదేశీ పర్యటలనపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కోవాగ్జిన్ తీసుకున్నవారికి కూడా తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిఇస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం.. డబ్ల్యూహెచ్‌వో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.. అయితే, భారత్ బయోటెక్ […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం వైఎస్ జగన్‌కు స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి ఉంటే… తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.. కాసేపటి క్రితం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించారు.. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా అన్ని శక్తులను కేంద్రీకరించాలని […]
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. చాలా మంది విద్యార్థులు కాలీజీల్లో ఇంకా చేరని పరిస్థితులు లున్నాయి.. అయితే, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో.. నవంబర్ 12వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఇంటర్ బోర్డు.. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్, […]