హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయం వైపు దూసుకెళ్తున్నారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్… ఇప్పటి వరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. ఈటల ఆధిక్యం 11 వేలు దాటేసింది.. 15వ రౌండ్లోనే ఈటలకు 2,149 ఓట్ల ఆధిక్యం దక్కగా.. మొత్తంగా ఆయనకు ఇప్పటి వరకు వచ్చిన మెజార్టీ 11,583 ఓట్లుగా ఉంది. ఇక, ఈటల విజయానికి తిరుగేలేదని ఆనందాన్సి వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ఉత్సవాల్లో మునిగిపోయాయి.. 15వ రౌండ్ ముగిసే సరికి.. […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెలువడలేదు.. కానీ, ఈ ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయిన కాంగ్రెస్లో మాత్రం అప్పుడే రచ్చ మొదలైంది.. అవకాశం దొరికినప్పుడల్లా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని టార్గెట్ చేసే ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఈ ఎన్నికల ఫలితాలపై హాట్ కామెంట్లు చేశారు.. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎన్నికల నోటిఫికేషన్ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు పట్టుకున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరిగినా.. ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు ఈటల.. మిగతా మండలాల్లో ఈటలకు అనుకూలమైన ఓటింగే భారీగా ఉందనే అంచనాలున్నాయి.. దీంతో.. ఈటల గెలుపు నల్లేరు మీద నడకే అని అంచనా వేస్తున్నారు. ఇక, ఈటల ఆధిక్యం పెరుగుతున్నా కొద్ది.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తున్నా.. మొత్తంగా మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్లో కొనసాగుతున్నారు.. ఇక, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోతోంది.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే తరహాలో ఫైట్ నడుస్తున్నా.. కాంగ్రెస్ లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఈ ఫలితాలపై కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఇలా స్పందించారు. […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.. హుజురాబాద్ ప్రజలతో పాటు.. తెలంగాణ మొత్తం ఆ ఫలితాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.. ఇక, 11వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఆధిక్యాన్ని సాధించారు.. 11వ రౌండ్ […]
ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ -యూజీ 2021 ప్రవేశపరీక్షా ఫలితాలను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. 16,14,777 మంది ఈ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా 15,44,275 మంది పరీక్షకు హాజరయ్యారు.. వారిలో 8,70,074 మంది అర్హత సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది.. ఈ ఫలితాల్లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్గుప్తా, మహారాష్ట్రకు చెందిన […]
ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది.. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్కూటర్లు, స్మార్ట్ఫోన్లు, బస్సులో ప్రయాణం.. కల్పిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. కాగా, ఇప్పటికే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రియాంక… తాజాగా ఉచిత హామీలను ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా.. తాము ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది.. అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు… అన్ని ప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత… మండలాల వారిగా ఇన్చార్జ్లను నియమించింది. నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు… విస్తృతంగా పర్యటించి… గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం మొదలు… పోలింగ్ రోజు ఓటర్లను పోలింగ్ బూతులకు చేర్చే వరకు పక్కా […]
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై చేసిన విమర్శలు, ఆరోపణలు కాస్త శృతిమించి తీవ్ర వివాదానికి, కేసులకు దారి తీశాయి.. అయితే, మరోసారి డ్రగ్స్పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం, చేసే పరిస్థితులు ఇవ్వండి.. 48 గంటల్లో కట్టడి చేస్తారన్నారు. కానీ, ఈ ప్రభుత్వం వారికి అధికారాలు ఇవ్వదని ఆరోపించారు. ఇక, రోడ్ల […]
‘విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని […]