ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. తన విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. డబ్బు సంచులను, మద్యం సీసాలకు హుజురాబాద్ ఓటర్లు పాతరేశారన్నారు.. చిన్నచిన్న ఉద్యోగస్తులను కూడా అధికార పార్టీ వేధింపులకు గురిచేసిందని విమర్శించిన ఆయన.. 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదన్నారు.. నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి […]
హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. రాజేందర్ 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. అయితే, […]
మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ విజయనగరం జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.. వైసీపీలో బొత్స పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని చిటికెలో కొల్పోయిన వ్యక్తి బొత్స.. అలాంటి గొప్ప నేత బొత్సకు కనీసం హోం మంత్రో.. పరిశ్రమల మంత్రో.. ఆర్థిక మంత్రో అవుతారు అనుకున్నా… కానీ, చివరికి మున్సిపల్ […]
తెలంగాణలో ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోల్ అయ్యాయి.. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. ప్రతీ రౌండ్లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలో నిలిచారాయన.. ఫైనల్‌గా చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్.. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి అన్నీ తానై నడించారు హరీష్‌రావు.. నోటిఫికేషన్ వెలువడకముందు నుంచి ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు.. కానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించిన […]
తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆయన తిరుగులేని విజయాన్ని సాధించారు.. మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. 20 రౌండ్లోనే ఈటల రాజేందర్ విజయం ఖాయమైపోయింది. ఎందుకంటే.. అప్పటికే ఈటల రాజేందర్ 21 వేలకు పైగా ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఇక లెక్కించాల్సిన ఓట్ల కంటే.. ఈటలకు లభించిన ఆధిక్యమే అధికంగా […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరప్రదమైన ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగిన ఓట్లు రాబట్టలేకపోయింది.. అయితే, ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది.. ఉప ఎన్నికల ఫలితాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్నే రేపుతున్నాయి.. ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఏకంగా 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్లోనూ వైసీపీ ఆధిక్యం సాదిస్తూ దూసుకెళ్లింది.. మొత్తంగా వైసీపీకి 1,12,211 ఓట్లు పోలుకాగా.. బీజేపీకి 21,678 ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీకి 6,235 ఓట్లు వచ్చాయి. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. ఇక, బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన […]
ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. రౌండ్ రౌండ్‌కి ఆయనకు లీడ్ పెరిగిపోతూనే ఉంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా వెనుకబడిపోగా.. ఓ దశలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి కొనసాగింది.. కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేదర్ ఆధిక్యాన్ని కనబరిస్తే.. మరికొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆధిక్యంలోకి వచ్చారు.. కానీ, ఓవర్ ఆల్గా మాత్రం.. ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతూనే వచ్చారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల […]
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపాయి.. మొదటి నుంచి తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయంపై నమ్మకంతో ఉన్నాయి పార్టీ శ్రేణులు.. అంతకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇక, రౌండ్ రౌండ్‌కు ఈటల రాజేందర్ లీడ్ పెరిగిపోతూనే ఉంది.. 15 రౌండ్ ముగిసేసరికి ఆయన ఆధిక్యం 11 వేలను క్రాస్ చేసింది.. ఇక, ఈటల రాజేందర్‌కు పట్టున్న ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కించాల్సి ఉండడంతో.. బీజేపీ విజయం […]