ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.. అన్ని పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రచారం, ర్యాలీలు, బహిరంగసభలు ఇలా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం.. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో.. ఇవాళ మరోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపై సమీక్ష నిర్వహించింది. రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది..
Read Also: ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఇక, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ్టి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే.. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, ఊరేగింపులపై ఫిబ్రవరి 11వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగించింది.. అంతర్గత సమావేశాలను కూడా తక్కువ సంఖ్యతో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.. మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో 1000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది ఈసీ.. ఇంటి ఇంటికి ప్రచారంలో 20 మందికి అనుమతి ఉంటుందని పేర్కొంది.. అంతర్గత సమావేశాలకు 500 మందికి అనుమతి ఉంటుందని తెలిపింది.. ఎన్నికల ప్రచారం, సమావేశాలు, సభలు.. ఇలా అన్నింటిలోనూ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.