పెట్రో ధరలు తగ్గించాల్సిందే.. భారతీయుల డిమాండ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఇవాళే ప్రారంభం అయ్యాయి.. రేపు 2022-23 వార్షిక బడ్జెట్‌ను మంగళవారం రోజు పార్లమెంట్ ముందుకు రాబోతోంది.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ప్రీ బడ్జెట్ డిమాండ్స్ పేరుతో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ ఒక నివేదిక విడుదల చేసింది.. బడ్జెట్ ఎలా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు..? అనే దానిపై అధ్యయనం నిర్వహించిన ఆ సంస్థ.. తాజాగా, నివేదికను బయటపెట్టింది.. అయితే, ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు, వినియోగ డిమాండ్‌కు మద్దతుగా ఆదాయపన్ను, ఇంధన పన్ను భారం తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఆ నివేదిక సూచించింది.
ప్రీ బడ్జెట్ డిమాండ్స్ పేరుతో విడుదలైన ఆ నివేదికలో.. బడ్జెట్‌లో కొత్తవి కాకుండా, గత బడ్జెట్‌లో ప్రకటించిన వాటి స్థిరీకరణపై సర్కార్ ఫోకస్ పెట్టాలని అంచనా వేసింది.. కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఉపాధి కల్పన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.. ఇక, ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ద్రవ్యలోటు స్థిరీకరణ విషయంలో ప్రభుత్వం కాస్త నెమ్మదిగా వ్యవహరించాలని.. ఆర్థిక వ్యవస్థకు కావాల్సినంత మద్దతు ఇవ్వడానికి కృషి చేయాలని సూచించింది ఆ నివేదిక. ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.. ప్రజల ఆర్థిక పరిస్థితులపై కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావం చూపింది.. కావున, ఆదాయపన్ను ఉపశమనాలు, ఇంధనాలపై పన్నుల తగ్గింపు రూపంలో మద్దతుగా ఇవ్వాలని కోరింది.. ఇక, అధిక పెట్రో ధరలు ద్రవ్యోల్బణానికీ కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల మేర వ్యయాలను పెంచినా.. ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష డిమాండ్ ఎందుకు పెరగలేదన్నది ఆర్థిక శాఖ విశ్లేషించుకోవాలని.. అవసరమైన రంగాలకు ప్రభుత్వ మద్దతు ఇప్పటికీ అవసరం ఉందని పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరింత ఆచరణాత్మకంగా ఉండాలని సూచించింది..
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!