కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇవాళ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.. రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం చర్చగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడంతో వచ్చిన ఈ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని పెట్టలేదు.. కానీ, బీజేపీ పోటీకి నిలిచింది.. అయితే, ఆ పార్టీకి సరైన […]
భారత ప్రధాని నరేంద్ర మోడీ… ఇటలీలో పర్యటిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని… మోడీ అని ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. రెండు రోజుల పాటు వాటికన్ సిటీలో జరగబోయే జీ20 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, ఇండోనేషియా, సింగపూర్, జర్మనీ దేశాధినేతలతో ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత వాటికల్ సిటీ చర్చి పోప్ ఫ్రాన్సిస్‌తో మోడీ సమావేశం […]
రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరిగింది. దాంతో అలర్ట్ అయిన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, పాక్షిక లాక్డౌన్ కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మెట్రోలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో […]
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయిన బద్వేల్లో మొత్తం రెండులక్షల 16వేల 206 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 8వేల 809 మంది, మహిళలు లక్షా 7వేల 375 మంది కాగా, థర్డ్ జెండ్ లో 22 మంది. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 281 […]
పొలిటికల్ హై ఓల్టేజ్ థ్రిల్లర్ హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 36వేల 283 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు లక్షా 17 వేల 563. మహిళా ఓటర్లు లక్ష18 వేల 719 మంది. ఎన్నికల నిర్వహణ కోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకూ ఓటర్లు […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆశాభావంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి.. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారి బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగాసాగుతాయి. వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి […]
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ పాలిటిక్స్ తీవ్రస్థాయిలో విమర్శలు, బూతుల వరకు వెళ్లాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.. 2018 నుంచి తాను గంజాయి స్మగ్లింగ్ విషయాన్ని హైలైట్ చేస్తూనే ఉన్నానని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ మరింత పెరిగిందని ఆరోపించారు. ఇక, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సమస్య ఇప్పుడు కొత్తగా […]
రౌడీ షీటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు ఏపీ పోలీసులు… కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. రౌడీ షీటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రౌడీ షీటర్లకు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామంటూ.. కృష్ణా జిల్లాలో రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.. జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసుల్లో ఉన్నవారిని కౌన్సిలింగుకు పిలిపించాం.. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించాం.. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని వెల్లడించారు.. ఇక, రౌడీషీట్లు, […]
హుజురాబాద్ ఎన్నికల్లో పోలీసులు వన్‌సైడ్‌గా చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత జి. వివేక్.. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.. వరంగల్‌లోని గాయత్రి గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశానికి వచ్చిన హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను అడ్డుకున్నారు పోలీసులు.. ఇక, పోలీసులకు నచ్చజెప్పి హోటల్‌కు వెళ్లారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మంత్రులు ప్రెస్ మీట్ పెడితే అడ్డుకోని పోలీసులు.. బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు? […]
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైందని.. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వెల్లడించిన ఐఎండీ.. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ […]