కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన దేనికి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పారన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.. ఇక, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్రమే సీఎం కేసీఆర్ అన్నారని.. కేసీఆర్ మాట్లాడిన తెళ్లారికే రాజ్యాంగం మారిపోయినట్టు కాచుకు కూర్చున్నారంటూ మండిపడ్డారు.. కేసీఆర్ ఆలోచన సమాజం ముందు పెట్టారు.. దానిపై చర్చ పెట్టాలి.. కానీ, ఆందోళనలు ఎందుకు అని అని ప్రశ్నించారు.
Read Also: బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!
ఇక, కేసీఆర్ ఆలోచనపై చర్చ చేయడం ఇష్టం లేని వాళ్లు, చర్చ పక్కదోవ పట్టించే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్.. మారిన పరిస్థితుల నేపథ్యంలో చర్చ చేయాలి, డైనమిక్ గా ఉండాలన్నారు. 105 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది బీజేపీ..కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించిన ఆయన.. అంబేద్కర్ విధానం అమలుకు నోచుకోక దళితుల మీద దాడులు చేస్తుంది బీజేపీ కాదా..? అని మండిపడ్డారు.. కేసీఆర్ చర్చ పెట్టిన వెంటనే రాజ్యాంగం మారిందా? అని ప్రశ్నించిన బాల్క సుమన్.. రాజ్యాంగ ఫలాలు పేదలకు అందకపోతే నేనే రాజ్యాంగం తగలబెడ్త అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యసభలో చెప్పిన మాటలు వినాలని సూచించారు.. ఇక, రాజ్యాంగం సమీక్ష చేయాలని కమిషన్ వేసింది బీజేపీ… సావర్కర్, గాడ్సే వారసులు.. ఎస్సీ అట్రాసిటీ కేసులకు అమైండ్ మెంట్ చేసింది బీజేపీ కాదా..? అని నిలదీశారు బాల్క సుమన్.