పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేబినెట్లో సీనియర్ మంత్రి, టీఎంసీ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ గురువారం కన్నుమూశారు.. ఆయన వయస్సు 75 ఏళ్లు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు.. ఈ ఘటన తర్వాత ఆస్పత్రిని సందర్శించిన సీఎం మమతా బెనర్జీ.. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న సుబ్రతా ముఖర్జీ.. రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని […]
పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో రోజురోజుకూ పైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలకు బ్రేక్‌లు వేయాలన్న ఉద్దేశంతో.. ఇప్పటికే లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలకు అడుగులు వేస్తూ.. వాహనదారులకు ఊరట కలిగించేలా.. తమ పరిధిలోని వ్యాట్‌ను తగ్గిస్తూ శుభవార్త వినిపించాయి.. కేంద్రం నిర్ణయం వెలువడిన రోజు కొన్ని […]
మేషం: ఈ రోజు ఈ రాశివారు విందు, వినోదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. వృషభం: ఈ రోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచి జరుగుతుంది.. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. మిథునం: ఈ రోజు ఈ […]
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుభవార్త చెప్పింది.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ సంస్థ భారత్ బయోటెక్‌తో పాటు.. ఆ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ఎంతో కాలంగా డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, ఇవాళ అందరికీ శుభవార్త చెప్పింది డబ్ల్యూహెచ్‌వో.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌కు అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)కు ఆమోదం తెలిపింది.. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఆరు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి.. కోవిషీల్డ్, స్పుత్నిక్ […]
కరోనాపై పోరాటానికి భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగ గడువును ఏడాది పాటు పొడిగించారు.. ఈ మేరకే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO).. వాక్సిన్ తయారీ తేదీ నుంచి ఏడాది పాటు వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.. ఈ విషయాన్ని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ప్రకటించింది.. అయితే, వ్యాక్సిన్ వినియోగ గడువును 24 నెలలకు పొడగించాలంటూ.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. దానితో పాటు […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది.. ఫస్ట్, సెకండ్ వేవ్లే కాకుండా.. మళ్లీ కొన్ని దేశాలు ఇప్పుడు కొత్త వేరింయట్ కలకలం సృష్టిస్తోంది.. ఇదే సమయంలో డ్రాగన్ కంట్రీలోనూ మళ్లీ పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి.. దీంతో.. కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. లాక్‌డౌన్‌కు కూడా వెళ్తున్నారు. ఇక, చైనాలో హెర్డ్ ఇమ్యూనిటీపై అంచనాలు వేస్తున్నారు ఆ దేశ శాస్త్రవేత్తలు.. తాజాగా, చైనా శాస్త్రవేత్త, పల్మనాలజీ నిపుణుడు జాంగ్ నాన్షాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. చైనాలో 2022 తొలి […]
జల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకే కాదు.. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి కూడా లేఖలు రాస్తున్నారు.. తాజాగా, జీఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్.. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021న లేఖ రాశామని.. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) […]
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు.. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు […]
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ […]
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది. వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలను నమోదు చేసి ఘన విజయం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు.. అయితే, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మకు 6 వేల పైచిలుకు ఓట్లు […]