పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత ఎన్నో కీలక పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెంచేయి.. మరోవైపు.. గవర్నర్-దీదీ సర్కార్ మధ్య కోల్డ్ వార్ ఎప్పుడూ నడుస్తూనే ఉంది.. కీలక అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడం.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో ఉంటారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్.. తాజాగా, మరో వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.. సీఎం మమత బెనర్జీ… గవర్నర్ జగదీప్ ధంకర్ ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ కాగా.. ఈ అంశంపై స్పందించిన గవర్నర్.. ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీని మీడియా ప్రశ్నించకపోవడం దురదృష్టకరం అన్నారు.. ఇక, ఇది ప్రజస్వామ్యానికి సవాల్‌గా పేర్కొన్న ఆయన.. గవర్నర్ తనపై ప్రతిరోజూ ట్వీట్లు చేస్తున్నారని తనపై ఆరోపణలు చేశారని.. కానీ తాను ఒక్క ట్వీట్ కూడా చేయలేదని తెలిపారు.
Read Also: ఉద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇదే సమయంలో సీఎం దీదీపై హాట్ కామెంట్లు చేశారు గవర్నర్ జగదీప్ ధంకర్.. తన టేబుల్‌పై ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో లేదని.. పెండింగ్ సమస్యలు ఉంటే, సీఎం, ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. తాను ప్రతిరోజూ తాజ్ బెంగాల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటన వంద శాతం అవాస్తవం అన్నారు.. తాను అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టుగా ఒక్క ట్వీట్ గానీ లేదా ఒక్క పేపర్‌ను నిరూపించాలంటూ సవాల్ విసిరారు గవర్నర్.