ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,040 శాంపిల్స్ పరీక్షించగా.. 5,983 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 11 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 11,280 మంది కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 3,25,40,787 చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,88,566కు, రికవరీ కేసుల సంఖ్య 21,73,313కి, మృతుల సంఖ్య 14,631కి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,622 యాక్టివ్‌కేసులు ఉన్నాయని.. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 741, గుంటూరులో 738, కృష్ణా జిల్లాలో 618, కడపలో 608 కేసులు నమోదయ్యాయి.
Read Also: రచ్చ దేనికి..? కేసీఆర్ డిమాండ్‌పై చర్చ పెట్టాలి..