ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేశాయి.. మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. దీంతో.. అప్రమత్తం అవుతోంది ఏపీ సర్కార్.. ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో… ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఇప్పటికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్ర […]
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్.. క్వారంటైన్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.. కరోనా టెస్టులు పెంచే అవకాశం ఉండగా… మాల్స్, థియేటర్లు, పబ్‌లపై నియంత్రణా చర్యలు చేపట్టే విధంగా ఓ నిర్ణయానికి రానున్నట్టుగా సమాచారం. ఇక, వ్యాక్సినేషన్ […]
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన […]
మేషం: ఈ రోజు ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. వృషభం: ఈ రోజు మీరు చేసే విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. మిథునం: ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలుగా మేలు చేస్తుంది.. కొత్త […]
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. గ్యాస్ ధర కూడా భారీగా పెరిగిపోయింది.. అందరికీ విరివిగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత వరుసగా గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో వినియోగం కూడా తగ్గడం ప్రారంభమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి… అయితే, ఈ సమయంలో అనూహ్యంగా చోటా ఎల్పీజీ సిలిండర్లకు గిరాకీ పెరిగిపోయింది.. ధర పెరిగిపోవడంతో.. ఎల్పీజీ సిలిండర్ ప్రామాణిక 14.2 కిలోల వెర్షన్ కంటే 5 కిలోల సిలిండర్‌కు డిమాండ్ పెరిగింది.. ఒకేసారి పెద్ద […]
కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్ మెర్చా నేత రాకేష్ టికాయత్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి.. […]
కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి… అవసరాలను బట్టి కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే తిప్పారు.. క్రమంగా కొన్ని రూట్లతో విమానసర్వీసులను నడుపూ వస్తున్నా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందే లేదు.. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితులు రావడంతో.. డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26వ తేదీన కేంద్రం ప్రకటించింది.. కానీ, మళ్లీ ఇప్పుడు […]
ఆమె ఓ ఎంపీ.. పైగా గర్భవతి.. అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.. దీంతో.. వెనుకా ముందు ఆలోచించకుండా వెంటనే ఇంట్లో ఉన్న సైకిల్ ఎక్కి ఆస్పత్రికి వెళ్లింది.. ఆ తర్వాత పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.. వెంటనే ఆమెకు డెలివరీ చేశారు వైద్యులు.. పండంటి బిడ్డకు ఆ మహిళా ఎంపీ జన్మనిచ్చింది.. ఇది ఏ సినిమా స్టోరీయో కాదు.. న్యూజిలాండ్‌లో జరిగిన యదార్థ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే జెంటర్ నిండు గర్భవతి.. […]
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం.. అయితే, కొన్ని సార్లు నేతలు చేసిన కామెంట్లు, ఆరోపణలు సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలే చేశారు.. నితీష్ కుమార్ కూడా గంజాయి తాగుతారు. ఇది మత్తు కేటగిరి కిందకు వస్తుంది.. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగం కూడా నిషేధించబడింది.. కానీ, ఆయన గంజాయి వ్యసనాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు అవుతోన్న మద్యపాన నిషేధంపై […]
కరోనా మహమ్మారి తరిమివేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. దీంతో వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది భారత్ ప్రభుత్వం.. అందులో భాగంగా దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆ తర్వాత మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.. ఇక, ఆ తర్వాత మరికొన్ని దరఖాస్తులు కూడా వచ్చాయి. అందులో.. పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు చేస్తున్న కొవొవాక్స్ టీకా కూడా ఉంది.. అయితే, దీనికి నిపుణుల […]