తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్‌లోకి వెళ్తున్నారు.. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మెడికల్ లీవ్‌లో ఉండనున్నారు మహేందర్ రెడ్డి.. ఎడమ భుజానికి స్వల్ప గాయం, శస్త్రచికిత్స కారణంగా మెడికల్ లీవ్‌లోకి వెళ్లారు తెలంగాణ పోలీస్ బాస్.. దీంతో మహేందర్ రెడ్డి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్ ఈమధ్యే బదిలీ అయ్యారు.. ఆయనను ఏసీబీ డీజీగా నియమించారు సీఎం కేసీఆర్.. ఇక, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.. మొత్తంగా పోలీస్ బాస్ మెడికల్ లీవ్‌లోకి వెళ్లడంతో.. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మొత్తంగా 15 రోజుల పాటు ఏసీబీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్.. డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
Read Also: Jagga Reddy: కాంగ్రెస్‌కు గుడ్‌బై..? రేపే అనుచరులతో భేటీ