కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం […]
మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య… కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందంటూ సెటైర్లు వేసిన ఆయన.. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇచ్చింది.. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్ఎస్జీతో రక్షణ కల్పించిందన్నారు.. కానీ, కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూరిటీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.. నారా భువనేశ్వరిపై […]
వరదల సమయంలోనూ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలేదంటూ.. ఓవైపు అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శిస్తే.. మరోవైపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.. ఇక, టీడీపీ నేతలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి.. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదు… తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు గోరంట్ల మాధవ్… అయిపోయిన పెళ్లికి […]
ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత […]
వడ్లు కొనుగోలు వ్యవహారంలో గత కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది.. కేంద్రం చెప్పేది ఒక్కటైతే.. రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. కేంద్రం స్పష్టంగా చెప్పినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే డ్రామా చేస్తుందని బీజేపీ విమర్శిస్తుందో.. ఇక, దీనిపై మరింత క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందానికి నిరశే ఎదురైంది.. తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం […]
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు తప్పుదంటూ ఎప్పటి నుంచో వైద్య నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.. అయితే, ఇప్పుడు సౌతాఫ్రికా కొత్త వేరియంట్ అన్ని దేశాలకు కునుకులేకుండా చేస్తోంది… ఈ కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది… ఆ దేశంలో కోవిడ్ కేసులు తీవ్రరూపం దాల్చాయి.. రోజుకు 76 వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. వణికిపోతున్నారు.. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.. ఇక, తాజా కేసులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోవడంతో ఆ […]
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యింది.. అయితే, సెకండ్ వేవ్ తర్వాత కాస్త సాధారణ పరిస్థితులు నెలకొనడంతో… క్రమంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.. ఇదే సమయంలో.. అక్కడక్కడ కోవిడ్ కేసులు వెలుగు చూస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. తాజాగా, దుండిగల్ బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది… పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో సెలవు ప్రకటించారు యూనివర్సిటీ నిర్వాహకులు.. రేపటి నుంచి సానిటైజ్ చేసి తరగతులు నిర్వహిస్తామని […]
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న తరుణంలో లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. సచివాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు మార్గ నిర్దేశం చేశారు.. ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల రూ. 55,657 కోట్ల ఆమోదానికి కృషి చేయాలి. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు, […]
డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధం అయ్యింది తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు.. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇంటర్ ఫలితాలు ఉంటాయని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.. కాగా, గత నెల 25 నుండి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 19వ తేదీతో స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా ముగించారు… ప్రస్తుతం మార్క్స్ డేటా క్రోడీకరణ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారం… బీఏసీలో ప్రతిపక్షం అడిగిన విధంగా అసెంబ్లీ సమావేశాలు పొడిగించాం.. అయినా చర్చించటానికి అంశాలేమీ లేక టీడీపీ కావాలని డ్రామాలు ఆడి బయటకు వెళ్లి పోయిందని అధికార పార్టీ ఆరోపించింది… టీడీపీ అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.. అయినా ఎందుకు పారిపోయారో అర్థం కాలేదని మండిపడ్డారు.. మొత్తంగా ఏడురోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశల్లో 26 […]