ఆంధ్రప్రదేవ్‌లో పేదళ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.. పేదలందరికీ ఇళ్ల పథకం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది డివిజన్ బెంచ్.. దీంతో, ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్లు తెలిపారు.. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు సింగిల్ బెంచ్… అయితే, సింగిల్ బెంచ్ […]
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. ఎవరికి ఎవరితో ముడి పడేది ముందే నిశ్చయించబడుతుందని చెబుతారు.. ఇక, ఆ జంట చూడ ముచ్చటగా ఉంటే.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అభినందిస్తారు.. బెంగళూరులో తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంది.. వరుడు విష్ణుకు 28 వచ్చినా.. వధువు జ్యోతికి 25 ఏళ్లు నిండినా.. వయస్సుకు తగ్గట్టు శరీరంలో పెరుగుదల లేదు.. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.. అయితే, ఈ క్యూట్ కపుల్‌కు […]
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనంగా మారింది.. కాల్ మనీ మాఫియా వేధింపులు భరించలేక ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ఆయన.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా తీసుకున్నాడు.. […]
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ ‘జన జాగరణ్ అభియాన్’ పేరుతో కాంగ్రెస్ మెగా ర్యాలీని చేపట్టనుంది. పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ “జనజాగరణ్ అభియాన్” నిర్వహించింది.. ఇక, దానికి ముగింపుగా ఢిల్లీలో డిసెంబర్ 12వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించింది.. […]
సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా, సౌతాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి, చండీగఢ్‌కు వచ్చిన ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటా అనే టెన్షన్ నెలకొనగా.. బెంగళూరుకు వచ్చిన వారిలో ఒకరిలో డెల్టా, మరొకరిలో డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్‌గా నిర్ధారించారు.. […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ […]
ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా […]
వర్షాల ఎఫెక్ట్‌తో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి… నిన్న మొన్నటి వరకు కిలో టమాటా వందకు పైగా పలకగా… ఇప్పుడు వంకాయ వంతు వచ్చింది.. హోల్‌సెల్ మార్కెల్లోనే కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది […]
మేషం: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వృత్తుల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. వృషభం: ఈ రోజు మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. […]