సీనియర్ పొలిటీషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్.. అదే విధంగా.. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించంది… ఇక, రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా.. రంగారెడ్డి, హైదారబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ […]
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.. ఊహించని విధంగా స్పీడ్‌గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఇప్పటికే ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని […]
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… అన్ని దేశాలు అంక్షలు విధించినా క్రమంగా విస్తరిస్తూనే ఉంది… జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసే పనిలోపడిపోయింది.. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్ బారినపడి ఎవ్వరూ మృతిచెందకపోవడం ఊరట కలిగించే విషయమే.. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఈ వేరియంట్ ఆందోళనకరమేనని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో.. అయితే ఇప్పటి ఈ మహమ్మారితో ఎవరూ ప్రాణాలు వదలలేదని పేర్కొంది.. […]
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు […]
ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యలు చేపడుతున్నా దేశాలు.. ఇక, భారత్‌లోని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి విజృంభించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంఉటన్నాయి.. ఇక, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో […]
కరోనా మహమ్మారి ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారత్‌తో పాటు చాలా దేశాలను ఇబ్బందులకు గురిచేసింది.. ఫస్ట్ వేవ్‌ను కాస్త లైట్ తీసుకోవడంతో సెకండ్ వేవ్ విరుచుకుపడింది.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మరణాల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ ఎప్పటి నుంచి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ మొదలైందా? […]
జవాద్ తుఫాన్ దూసుకొస్తుండడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏకంగా 120 రైళ్లను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.. ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని రైలు సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే కాగా.. నిన్న కూడా కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కలేదు.. ఇవాళ కూడా మరికొన్ని రైళ్లు స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ నెల […]
మేషం : ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు, […]
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు […]
ఓ వైపు ఇప్పటికే పీఆర్సీ ప్రిక్రియ పూర్తి అయ్యింది.. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతుంటే.. తమ ఆందోళన మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మాకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక […]